హైదరాబాద్

నెలాఖరులోగా పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: వేసవి కాలం ప్రజలకెలాంటి ఇబ్బందుల తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై సిద్ధం చేసిన వేసవి కార్యచరణ కింద చేపట్టాల్సిన పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయనున్నట్లు జలమండలి ఎండి దాన కిషోర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బోర్డు ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ ఈ వేసవిలో నగరవాసులకు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వేసవి తీవ్రతరం కాకముందే వేసవి కార్యచరణ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు జూన్‌లోగా పూర్తయ్యే పనులను, వేసవిని దృష్టిలో పెట్టుకుని కాస్త ముందుగానే ఏప్రిల్ నెలలోనే పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్, మెయింటనెన్స్ సర్కిళ్ల పరిధుల్లో హాట్ స్పాట్‌లపై ఆయన అధికారులతో చర్చించారు. తరుచుగా మురుగునీరు ప్రవహించే ప్రాంతాలు , కాలుష్య సంబంధిత ఫిర్యాదులు అధికంగా వచ్చే అన్ని ప్రాంతాల్లో మరమ్మతుల కోసం రూపొందించిన అంచనాలను పరిశీలించారు. మురుగురు నీరు నిల్వ ఉండకుండా లీకేజీలను నిరోధించేందుకు హోటళ్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు, మెస్‌లు ఉన్న పరిధిలో ఉన్న వినియోగదారులంతా తప్పకుండా సిల్ట్ చాంబర్లను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్లను ఆదేశించారు. అలాగే సిల్ట్ చాంబర్ల నిర్మాణంతో రానున్న వర్షాకాలంలోనూ కొంత మేరకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఈ విషయంలో ఇప్పటికే నోటీసులిచ్చినా స్పందించని వారిని గుర్తించి, వారి మంచినీటి కనెక్షన్లు, సీవరేజీ కనెక్షన్లను కట్ చేయాలని ఆదేశించారు. అలాగే రోడ్డు కంటే లోతులో ఉన్న మ్యాన్‌హోళ్ల ఎత్తును పెంచాలని ఈ సందర్భంగా ఎండి సూచించారు. అనంతరం ఆయన జలమండలి రాబడి, ఆదాయం, ఖర్చులపై సమీక్షించారు. బోర్డు రెవెన్యూ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ మాసంలో వసూళ్లను కనీసం రూ. వంద కోట్ల వరకు సాధించాలన్నారు. ఆరు నెలల నుంచి నల్లా బిల్లులు చెల్లించని మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ డైరెక్టర్ జి. రామేశ్వర్‌రావు, డైరెక్టర్ అజ్మీరా కృష్ణణ్‌తో పాటు ఆపరేషన్, మెయింటనెన్స్ అధికారులు పాల్గొన్నారు.