హైదరాబాద్

సిసి కెమెరాలతో నేరాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్ నగరంపై నిఘా నేత్రం నలుదిశలా పని చేస్తోంది. రోజు రోజుకీ అందుబాటులోకి వస్తున్న ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సిసి కెమెరాల్లో వస్తున్న సరికొత్త ఫీచర్లతో నేరాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ముందుకెళుతున్నారు. ప్రజా భద్రత చట్టాన్ని అనుసరించి తెలంగాణ ప్రభుత్వం కమ్యూనిటీ సిసి టివి ప్రాజెక్టును సీరియస్‌గా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం సిసి కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. 2014 నవంబర్‌లో అరబిందోఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డిని ఒక మాజీ పోలీసు కానిస్టేబుల్ ఎకె 47 తుపాకీతో బెదిరించి కెబిర్ పార్కు వద్ద కిడ్నాప్ యత్నం చేశారు. అక్కడ సిసి కెమెరా ఉండడం వల్ల కిడ్నాప్ యత్నం కేసును సులభంగా పరిష్కరించారు. రెండు రోజుల కిందట కెబిఆర్ పార్కు లోపల, బయట కలిపి 64 సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేసిన నగర పోలీసులు అత్యంత భద్రత కలిగిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 వేల సిసి కెమెరాలను హైదరాబాద్ నగరం, శివారుల్లో ఏర్పాటు చేశారు. దీనిలో 12 వేలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే, మరో 3 వేలు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సిపి ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల కిడ్నాప్, హత్యలు, అల్లర్లు, ఆందోళనల సమాచారాన్ని విజువల్స్ సహా క్షణాల్లో సమాచారం అందుతోంది. దీంతో నేరగాళ్ల కదలికలే కాకుండా జరిగిన సంఘటన గురించిన సమాచారం, నిందితుడు వెళ్లిన దారిని గుర్తించేందుకు పోలీసులకు వీలు కలుగుతోంది. సిసి కెమెరాల్లో విజువల్స్ రికార్డింగ్‌తో చాలా పెద్ద కేసులే పరిష్కారమయ్యాయి. నగర శివారులోని ఒక స్కూల్లో జరిగిన అభయ రేప్ కేసు, బేగంబజార్‌కు చెందిన అభయ్ మొదాని (15) కిడ్నాప్, హత్య కేసు, పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక హత్య కేసును సిసిటివి కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా పరిష్కరించిన పోలీసులు వీటి అవసరాన్ని గుర్తించి శరవేగంగా విస్తరిస్తున్నారు. కాలనీలు, నివాస కాంప్లెక్స్‌లు భారీగా ఉన్న చోట్ల తప్పనిసరిగా సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు అవగాహన చర్యలు చేపట్టడంతో చాలా చోట్ల మంచి స్పందన వచ్చి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నారు. నగరంలో పలు చోట్ల అనుమానస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించేందుకు, ఎక్కడైనా గుంపులు గుంపులుగా ఉండి ఆందోళనకు దిగుతున్నట్లు కనిపించినా వెంటనే సిసి కెమెరాలో విజువల్స్‌తో పాటు అలర్ట్ మెసేజ్‌లను కూడా పంపే విధంగా సిసి కెమెరాలు అందుబాటులోకి రావడంతో పోలీసులు వాటిని వినియోగిస్తున్నారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని నగర సిపి చెబుతున్నారు. కాగా నగరం, శివారు ప్రాంతాల నుంచి విపరీతంగా సిసిటివి కెమెరా ఫుటేజ్‌లు వచ్చి పడుతుండడంతో వాటిని విశే్లషించేందుకు అనువుగా పోలీసులు కొత్త సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు వినియోగిస్తున్నారు.