హైదరాబాద్

ఉద్యమకారులకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థలో గురువారం నుంచి ప్రజాపాలన మొదలైంది. 2014 డిసెంబర్ 4న పాలక మండలి గడువు ముగియటంతో స్పెషలాఫీసర్ పాలన మొదలైన సంగతి తెలిసిందే.
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించి అత్యధిక సంఖ్యలో సీట్లను కైవసం చేసుకునేందుకు చక్కటి కార్యచరణను సిద్ధం చేసిన సిఎం కెసిఆర్ ఇపుడు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కేటాయింపులోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలు పూర్తయినా సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమకారులను పక్కనబెట్టారన్న ఆరోపణలు, ఆపోహలకు కెసిఆర్ ఎంతో వ్యూహాత్మకంగా తెర దింపారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో రెండో తరం ఉద్యమకారుల్లో యువకుడైన బొంతు రామ్మోహన్‌కు ఉమ్మడి రాజధాని మేయర్ బాధ్యతలు, అలాగే బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్ధిన్‌కు డిప్యూటీ మేయర్ బాధ్యతలు కట్టబెట్టారు. తెలంగాణ ఉద్యమంలో వయోవృద్థులూ ఉన్నా, వారిని పక్కనబెట్టిన కెసిఆర్ మున్ముందు నగరంలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేపట్టేందుకే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బొంతు రామ్మోహన్, బాబా ఫసీయుద్దిన్‌లు ఇదివరకెన్నడూ క్రీయాశీల రాజకీయాల్లో లేరు. అయినా వారికే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కేటాయించారు.
ఈ ఇద్దరు ఉద్యమకారులకు ఎవరూ ఊహించని తరహాలో కెసిఆర్ పట్టం కట్టడం నేటికీ ఉద్యమకారులను కెసిఆర్ పక్కనపెట్టారన్న వ్యాఖ్యలకు చెక్ పెట్టినట్టయ్యింది. అంతేగాక, ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించిన వారే గ్లోబల్ సిటీ సాధనలో అంకితాభావంతో పనిచేయగలరన్న నమ్మకంతోనే వీరిద్దరికి కెసిఆర్ ఈ అవకాశాన్నిచ్చారని చెప్పవచ్చు.
నిర్మాణాత్మక
ప్రతిపక్షంగా ఉంటాం

కాంగ్రెస్ కార్పొరేటర్
శాంతి సాయిజెన్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: జిహెచ్‌ఎంసి పాలక మండలిలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇద్దరు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నా, కౌన్సిల్ సమావేశాల్లో ఓ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్, పటాన్‌చెరు కార్పొరేటర్ శంకరయాదవ్‌లు అన్నారు. గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రమాణస్వీకారం అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో నగర ప్రజలిచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తమ డివిజన్‌లో పారిశుద్ధ్యం పరంగానే గాక, వౌలిక వసతులు, మహిళల భద్రత వంటి అనేక రకాల సమస్యలున్నట్లు ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గుర్తించామని వారు వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. నగరాభివృద్ధికి సంబంధించి పాలక మండలి తీసుకునే నిర్ణయాలను సమర్థించటంతో పాటు కార్పొరేషన్‌కు ప్రజలకు నష్టాన్ని కల్గించే నిర్ణయాలను ఎదుర్కొంటామని వారు వివరించారు.
జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం : అయేషా రుబీనా
నగరంలోని అన్ని డివిజన్లలో కూడా వౌలిక వసతులైన మంచినీరు, కరెంటు సరఫరా, డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపర్చటంతో పాటు మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించినపుడే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆస్కారముంటుందని అహ్మద్‌నగర్ మజ్లిస్ కార్పొరేటర్ అయేషా రుబీనా వెల్లడించారు. ఇప్పటికిపుడే మనం మోడల్ స్కూళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం లేని పక్షంలో కనీసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలనైనా మెరుగుపరిస్తే నిరుపేద పిల్లలకు కనీస విద్య అందుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో తాను కో ఆప్షన్ సభ్యురాలిగా వ్యవహరించిన అనుభవం ఉందని తెలిపారు.

నమ్మకాన్ని వమ్ము చేయను
సిటీకి సేవ చేసేందుకు
ఇదో గొప్ప అవకాశం
ఉద్యమ, రాజకీయ గురువు కెసిఆరే
సిఎం విజన్‌తోనే గ్లోబల్ సిటీ సాధ్యం
వౌలిక వసతుల మెరుగే ప్రధాన లక్ష్యం
గ్రేటర్ కొత్త మేయర్ బొంతు రామ్మోహన్
నేడు బాధ్యతల స్వీకరణ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ ఉద్యమంలో భాగస్వామినైనా నాకు నగరానికి సేవ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చారని, దీన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ బొంతు రామ్మోహన్. గురువారం మేయర్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎవర్ని ఎక్కడ పెట్టాలో సిఎం కెసిఆర్‌కు బాగా తెలుసునని, ఆయన తనకు మేయర్ పదవిని కేటాయించటం పట్ల రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ నగరంలో రోజురోజుకి జనాభా, సిటీ విస్తీర్ణం పెరుగుతూ వచ్చిందే తప్ప, జనాభాకు తగిన విధంగా వౌలిక వసతుల కల్పన గానీ, అభివృద్ధి గానీ జరగలేదని వ్యాఖ్యానించారు.
అరవై ఏళ్ల సమైక్య పాలన కొనసాగిన హైదరాబాద్ నగరంలో ఇరవై ముప్పై లక్షల జనాభాకు అప్పట్లో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థనే నేటికీ అందుబాటులో ఉందని, చిన్నపాటి వర్షానికే మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని, నిత్యం రద్దీగా ఉండే పలు జంక్షన్లలో కూడా భారీగా వర్షపు నీరు నిలుస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తుందని ఆయన వివరించారు. ఈ లోపాలన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు జరిగిన పలు అభివృద్ధి పనులు ప్రణాళికబద్దంగా జరగకపోవటమే ప్రధాన కారణమని ఆయన వ్యాఖ్యానించారు. నేటికీ కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి కూడా మంచినీళ్లు రావటం లేదన్న విషయాన్ని తాను ఎన్నికల ప్రచారంలో గుర్తించానని, వాటర్ గ్రిడ్, మిషన్ భగీరథ వంటి పథకాలను అమలు చేస్తూ నగరంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని వివరించారు. అయితే కెసిఆర్‌కు నగరంపై ఓ చక్కటి విజన్ ఉందని ఆయన హయాంలోనే నగరం గ్లోబల్ సిటీ కావటం సాధ్యమన్నారు. నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సిఎం బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారన్నారు. వాటిని జిహెచ్‌ఎంసి తరపున అమలు చేసి, నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో తనవంతు పాత్రను పోషిస్తానని మేయర్ రామ్మోహన్ వివరించారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గూగుల్, ఊబర్, అమేజాన్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, కేవలం వ్యాపారపరంగానే గాక, ఇక్కడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. దీనికి తోడు జిహెచ్‌ఎంసి తరపున ప్రజలకు అందుతున్న సేవలను మరింత త్వరితగతిన అందించేందుకు వీలుగా, ఎలాంటి జాప్యం లేకుండానే భవన నిర్మాణ అనుమతులు కూడా అందించేలా పలు సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు మేయర్ రామ్మోహన్‌రావు వివరించారు.
మేయర్ గురించి
బొంతు రామ్మోహన్ స్వస్థలం వరంగల్. నేరెడ ప్రాంతంలో జూన్ 5, 1973లో రామ్మోహన్ జన్మించారు. పాఠశాల విద్యావరకు స్వస్థలంలో చదుకున్న ఆయన ఆ తర్వాత ఎం.ఏ. బిఇడి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన పలుసార్లు జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బొంతు రామ్మోహన్ గతంలో తెలంగాణ ఉద్యమంలో చెర్లపల్లి జైలుకెళ్లారు. నేడు చెర్లపల్లి డివిజన్‌కే కార్పొరేటర్‌గా గెలవటంతో పాటు నగర ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యారు.
15ఏళ్ల శ్రమకు ప్రతిఫలం
మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవి
బొంతు రామ్మోహన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ తమ పదకొండేళ్ల వివాహ జీవితంలో బొంతు రామ్మోహన్‌లో ఓ మంచి ఉద్యమ స్పూర్తి, నిజాయితీ, పట్టుదల చూశానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో తాము 15 ఏళ్ల పాటు పడ్డ శ్రమకు ప్రతిఫలమే నేడు మేయర్‌గా ఎన్నికకావటమని ఆమె వ్యాఖ్యానించారు.
ఉద్యమ దశలో తామెన్నో కష్టాలకు ఓర్చుకున్నామని ఆమె వివరించారు. ఆయన మేయర్ కావటంతో నగరాభివృద్ధికి సంబంధించి ఆయనపై మరింత బాధ్యత పెరిగిందని, కెసిఆర్ విజన్ ప్రకారం నగరం గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకునేందుకు మేయర్‌గా ఆయన చేయాల్సిన కృషికి తనవంతు సహకారం ఉంటుందని శ్రీదేవి వివరించారు.