రంగారెడ్డి

మహానగర రూపురేఖలు మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 18: హైదరాబాద్ మహనగర సుందరీకరణకు రూ.20 వేల కోట్లను కేటాయించి అభివృద్ధి పరుస్తున్న రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రూ. 1.70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం పాతబస్తీ నుంచి రాజేంద్రనగర్‌కు భారీ కాన్వాయ్‌తో మైలార్‌దేవ్‌పల్లికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు. మొదటగా మైలార్‌దేవ్‌పల్లిలోని రూ.40 లక్షలతో నిర్మించిన జిహెచ్‌ఎంసి పార్కును ప్రారంభించారు. అక్కడ నుంచి ర్యాలీగా తరలివెళ్లి అరాంఘర్ చౌరస్తాలోని రూ. 20 లక్షలతో నిర్మించిన ఏసి టాయ్‌లెట్స్‌ను ప్రారంభించారు.
అనంతరం ప్రేమావతిపేట్‌లో రూ.50 లక్షలతో నిర్మించిన మోడల్ మార్కెట్‌ను ప్రారంభించారు. అక్కడ నుంచి నేరుగా ర్యాలీతో అత్తాపూర్ చింతల్‌కుంటలో రూ.60 లక్షలతో చెరువు సుందరీకరణ పార్కును ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మహ్ముద్ అలీ, శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలతో కలిసి చింతల్‌కుంట చెరువు సుందరీకరణను పరిశీలించారు. మంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రి అడుగడుగునా టిఆర్‌ఎస్ నేతలు గులాబీ పూలను మీద జల్లుతూ స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో మూడు డివిజన్ల పరిధిలో ఆయన కాన్వాయ్ ముందు యువకులు ఆకర్షణగా నిలిచారు.
మోడల్ మార్కెట్‌లో
షాపుల కేటాయింపు
జిహెచ్‌ఎంసి నిధులతో గ్రేటర్‌లోనే ఆదర్శంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని ప్రేమావతిపేట్, టిఎన్జీవోఎస్ కాలనీలో నిర్మించిన మోడల్ మార్కెట్లను మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించి ఏడుగురు లబ్ధిదారులకు షాపులు కేటాయించారు. లక్కీ డ్రాలో లబ్ధిదారుల పేర్లు తీసి, వారికి గ్రాము బంగారు కాయిన్‌లను బహుమతిగా అందజేశారు. అనంతరం స్వచ్ఛసేన కార్యక్రమాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.
మంత్రికి ఘన స్వాగతం
వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌కు వచ్చిన మంత్రి కెటిఆర్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌లకు పుష్పగుచ్ఛం అందజేసి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సౌత్‌జోన్ జోనల్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్- 6 డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఈ ఈ లచ్చిరామ్, హెచ్ ఎండి ఏ ఉన్నతాధికారులు, సర్కిల్ మూడు డివిజన్ల టిఆర్‌ఎస్ అధ్యక్షులు సరికొండ వెంకటేష్, వనం శ్రీరామ్‌రెడ్డి, పోరెడ్డి ధర్మారెడ్డి, కార్పొరేటర్లు కోరణి శ్రీలత, రావుల విజయ జంగయ్య, సీనియర్ టిఆర్‌ఎస్ నేత కాంతారెడ్డి, మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, పడమటి శ్రీ్ధర్‌రెడ్డి, అక్కెం కృష్ణయాదవ్, దేవులపల్లి స్వామి, అడికె అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రాజేంద్రనగర్ సర్కిల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కేటి ఆర్, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ల సమక్షంలో 500 మందితో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ శ్రీనివాస్‌గుప్తా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటిఆర్ టిఆర్‌ఎస్ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అన్ని పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని తెలిపారు. అతిపెద్ద పార్టీగా టిఆర్‌ఎస్ అవతరిస్తుందని అన్నారు.