హైదరాబాద్

ఇంటికో మొక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యం నుంచి ఉపశమనం కల్గించి, పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు మరోసారి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి ముందస్తుగా ఏర్పాట్లుచేస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎండలు దంచికొట్టిన మాదిరిగానే వర్షాకాలంలో వర్షాలు కూడా విస్తారంగా కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ చేసిన సూచనల మేరకు ఈ సారి నగరంలోని వివిధ ప్రాంతాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల్లో కోటి మొక్కలను నాటాలన్న సంకల్పంతో ఉన్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. కానీ ఈసారి ఇంటికో మొక్కను పంపిణీ చేయటంతో పాటు ఆ కుటుంబ సభ్యులే ఆ మొక్క నిర్వాహణ బాధ్యతలు చేపట్టేలా చర్యలు చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమవుతోంది. ఇంటికో మొక్క నాటడమే గాక, నాటి మొక్కలన్నింటికీ పక్కాగా లెక్క వేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమవుతోంది. గత సంవత్సరం 84లక్షల మొక్కలు నాటినా, ఈసారి జిహెచ్‌ఎంసి నాటే మొక్కల కన్నా ప్రజలచే నాటించే మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. గత సంవత్సరం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు 84 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడిస్తున్న జిహెచ్‌ఎంసి ఈసారి కనీసం కోటి మొక్కలను నాటాలన్న సంకల్పంతో ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఇందుకుగాను వివిధ ప్రభుత్వ శాఖలకు, జిహెచ్‌ఎంసి అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు టార్గెట్లు విధించనున్నట్లు తెలిపారు. కేవలం మొక్కలు నాటడమే గాక, రోడ్డు విస్తరణ వంటి పనులతో మొక్కలు దెబ్బతినకుండా, వాటి పెంపకం సక్రమంగా జరిగేలా, అందుకు అవసరమయ్యే ఏర్పాట్లను చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా అన్ని సర్కిళ్ల పరిధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ కమిషనర్ల స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో, స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఈ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిహెచ్‌ఎంసి కో ఆర్డినేటర్‌గా వ్యవహారించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. మొక్కలను నాటి ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేయటం, అలాగే నాటి ప్రతి మొక్కను కాపాడుకోవటంలో కేవలం జిహెచ్‌ఎంసి, ప్రభుత్వ శాఖలే గాక, పౌరులు కూడా తమవంతు బాధ్యతతో వ్యవహారించాలని కమిషనర్ సూచించారు. అంతేగాక, కార్యక్రమం విజయవంతం కావటంతో పాటు మొక్కల పెంపకానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా మొత్తం 46 ప్రభుత్వ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని కూడా కమిషనర్ అధికారులకు సూచించారు.