హైదరాబాద్

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: జిహెచ్‌ఎంసిలో పనిచేస్తున్న సుమరు 20వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యభద్రతపై కూడా కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి దృష్టి సారించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అర్దరాత్రి పూట రోడ్లను ఊడ్చే కార్మికులకు ప్రతి నెల వైద్య చికిత్సలు అందుబాటులోకి తేవాలని ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కార్మికుల వైద్య అవసరాల కోసం పెద్ద ఎత్తున ఇఎస్‌ఐకి వాటా మొత్తాన్ని చెల్లిస్తున్నామని వివరించారు. ప్రతి నెల ఇఎస్‌ఐతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహాయ సహకారాలను తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. కనీసం నెలలో ఒకసారైనా కార్మికులకు వైద్య పరీక్షలు చేయించాలని, ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికి తోడు ఈనెల 30తేదీలోపు కార్మికులందరికి ప్రదానమంత్రి సురక్షా యోజన పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇంటింటికి అందించనున్న రెండు బిన్ల ఉపయోగం, స్వచ్ఛ ఆటో టిప్పర్ల వినియోగం వంటి అంశాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన పెంపొందించాల్సి ఉందని సూచించారు. దీనికి గాను స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా అందించే నిధులను వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో నగరంలో ప్రతి స్వచ్ఛ యూనిట్‌లో వౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిర్వహించటం జరుగుతుందని వివరించారు. అంతేగాక, స్వచ్ఛ్భారత్ అవార్డుకు గాను జిహెచ్‌ఎంసి పేరును ప్రతిపాదించాలని ఆయన అధికారులకు సూచించారు.
పకడ్బందీగా పరిచయం
క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే కార్మికులు, ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన పరిచయం కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వివిధ విభాగాల వారీగా క్షేత్ర స్థాయి విధులు నిర్వహిస్తున్న కార్మికులతో పాటు కొత్తగా వచ్చిన ఆటో టిప్పర్ల డ్రైవర్లు, సహాయకులు సైతం ఈ పరిచయం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు చుట్టూ ప్రహరీగోడలను నిర్మించాలని, ఈ దిశగా అధికారులు యుద్దప్రాతిపదికన పనులు ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు.