హైదరాబాద్

అవినీతి ‘ప్లాంట్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: మహానగరంలో మంచినీటి కొరత తీవ్రరూపం దాల్చుతోంది. కనీసం మార్కెట్‌లో మంచినీళ్లు కొని దాహం తీర్చుకుందామన్నా గగనంగా మారింది. జలమండలి వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకున్నా నీళ్లు వచ్చేందుకు కనీసం పదిరోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో వారానికోసారి నల్లా వస్తుండటంతో ప్రజలు తమ అవసరాల కోసం బుక్ చేసుకుంటున్న వాటర్ ట్యాంకర్లను అధికారులు బడాబాబులకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మళ్లించటంతో పేద, మధ్య తరగత ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వారికి పంపాల్సి ఉంది కదా! అని ప్రశ్నిస్తే అసలే కరవు కాలం ఆపై ఉన్నతాధికారుల వత్తిడికి చేసేదేముందంటూ సాక్షాత్తు జలమండలి ఎండి జనార్దన్ రెడ్డి సైతం పరోక్షంగా సమాధానం చెప్పుకొచ్చారంటే నగరంలో మంచినీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చు. ప్రజల అవసరాలను అదునుగా చేసుకుని పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు వాటర్ ప్లాంటుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కావటం, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ సేపు సరఫరా కావటం వంటి కారణాల నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలెక్కువగా ట్యాంకర్లపైనే, ప్యాకేజీ వాటర్‌పైనే ఆధారపడి ఉండాల్సిన దుస్థితి తలెత్తింది.
బోర్ నీళ్లే మినరల్ వాటర్
ప్రజల అవసరాలు ఆసరాగా గ్రేటర్ పరిధిలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. బోర్ నీటిని మినరల్ వాటర్‌గా నమ్మిస్తూ కొన్ని ప్రైవేట్ సంస్థలు ఎలాంటి గుర్తింపు లేకుండా నీటి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు సంస్థలు నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్నారు. ఎలాంటి నాణ్యత పాటించకుండా బోర్ నీటిని కొద్ది పాటి శుద్ధి చేసి మినరల్ వాటర్‌గా మారుస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల దాహర్తిని వ్యాపారంగా చేసుకుని గ్రేటర్ పరిధిలో ప్రతి నెల రూ. 130 కోట్ల మేరకు మినరల్ వాటర్ దందా కొనసాగుతున్నట్లు అంచనాలున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న వాటర్ ప్లాంట్లు నీటిని అరకొరగా శుద్ధి చేసి విక్రయిస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వీటిలో కొన్ని ప్లాంట్లు జలమండలి నీటిని నేరుగా ప్యాక్ చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం. అనధికారిక ప్లాంట్లలో మినరల్ వాటర్ శుద్ధికి ఫ్రీలేషన్, ఎయిర్‌లేషన్, కార్బన్ వంటి తొమ్మిది రకాల ప్రక్రియలు జరగాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ జరగటం లేదు. దీంతో నీటిలో బాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఈ రకమైన నీటిని సేవిస్తే ప్రజలు అనారోగ్యం పాలవుతారు. బాటిల్స్, పాలిధిలిన్, పాలివినైల్, క్లోరైడ్ పాలిప్రోఫినల్‌తో తయారైన వాటిని ఉపయోగించాలి కాని నాసిరకంతో తయారు చేసిన వాటిని వాడుతున్నారు. ప్యాక్‌చేసే బాటల్స్‌ను, క్యాన్‌లను క్లోరిన్‌తో శభ్రం చేయాలి నీటిని ఫిల్టర్ శుద్ధి చేసిన 48 గంటల తర్వాతే బాటల్స్‌లోగాని, క్యాన్స్‌లో గాని మంచి నీటిని నింపాలి. వాటర్ ప్యాకెట్స్ (పౌచ్) చౌకగా వస్తుందని సేవిస్తే అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.