బిజినెస్

అమెరికా సంస్థల్లో జైన్ ఇరిగేషన్‌కు వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (జెఐఎస్‌ఎల్).. అమెరికాలోని రెండు సంస్థల్లో 80 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. మైక్రో-ఇరిగేషన్ డీలర్లైన అగ్రీ-వ్యాలీ ఇరిగేషన్ (ఎవిఐ), ఇరిగేషన్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఐడిసి) సంస్థల్లో 48 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ వాటాను అందుకుంటున్నట్లు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జెఐఎస్‌ఎల్ తెలిపింది. రాబోయే కొద్దివారాల్లో ఈ లావాదేవీ ముగియగలదన్న ఆశాభావాన్ని జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ సిఇఒ అనిల్ జైన్ ఇక్కడ పిటిఐకి తెలిపారు. ఈ లావాదేవీకి ఎలాంటి ప్రభుత్వ, రెగ్యులేటరీ అప్రూవల్స్ అక్కర్లేదన్నారు.