హైదరాబాద్

శివార్లకు మిషన్ భగీరథ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: వేసవి కాలం వచ్చిందంటే చాలు..ఏ ప్రాంతంలో చూసిన 3పానీ1పట్టుయుద్ధాలే దర్శనమిచ్చేవి. పాలకులు, జలమండలి అధికారులు ఎప్పటికపుడు వేసవి కాలం కష్టాలను అధిగమించేందుకు కంటితుడుపు చర్యగా ఎప్పటికపుడు తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకునే వారు. కానీ మహానగరంలో నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చేందుకు ఏళ్ల క్రితం నుంచే కృష్ణా, గోదావరి నీటి తరలింపు ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే! కానీ అధిక మొత్తంలో నీటిని తరలించుకుని వాటిని ఎక్కడ నిల్వ చేసుకోవాలన్న విషయంపై పాలకులు, అధికారులు దృష్టి సారించలేకపోయారు. ముఖ్యంగా గ్రేటర్‌లో విలీనమైన 12 శివారు మున్సిపాల్టీల్లో నేటికీ ప్రజలు నీటిని కొనుగోలు చేసి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రూ. 1900 కోట్ల వ్యయంతో చేపట్టిన హడ్కో తాగునీటి ప్రాజెక్టు పనులపై కానీ స్వరాష్ట్రం, స్వపరిపాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ, జలమండలి ఎండి దాన కిషోర్ నిరంతర సమీక్షల కారణంగా నిన్నమొన్నటి వరకు గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న శివార్ల గొంతు ఎట్టకేలకు తడవనుంది. గురువారం ఏకంగా నాలుగు రిజర్వాయర్లు అందుబాటులోకి రావటంతో ఈ విషయంపై ప్రజల్లో కూడా నమ్మకం పెరిగిందని చెప్పవచ్చు. అంతేగాక, ఈ ప్రాజెక్టు కింద మొత్తం 56 రిజర్వాయర్లను నిర్మించే పనులు చేపట్టగా, మిగిలిన మరో 52 రిజర్వాయర్లను మరో రెండునెలల్లోనే అందుబాటులోకి తెచ్చేలా పనులను వేగవంతం చేస్తామని మంత్రి కెటిఆర్ హామీ కూడా ఇచ్చారు. జూన్ నెలాఖరుకల్లా 12 రిజర్వాయర్లను అందుబాటులోకి తేవటంతో పాటు మొత్తం 300 కిలోమీటర్ల మేరకు ఈ హడ్కో ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తొలి దశగా నాలుగు రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చిన మిగిలిన రిజర్వాయర్ల పనులను కూడా నిరంతరంగా సమీక్షిస్తూ వీలైనంత త్వరగా అందుబాటులోకి తేనున్నారు.
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పరిధిలోని కెపిహెచ్‌బి ఫేస్ 4లో 2.5 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్‌తో పాటు హుడా మియాపూర్‌లో 6 మిలియన్ లీటర్ల నీరు అదనంగా సరఫరా చేసేందుకు గాను మరో 1200 నూతన కనెక్షన్లు ఇచ్చేందుకు ఆస్కారమేర్పడింది. ఈ రకంగా నాలుగు రిజర్వాయర్లకు కూడా వెయ్యి నుంచి రెండువేల కనెక్షన్లను అదనంగా ఇచ్చే అవకాశమేర్పడింది. ఈ కనెక్షన్లను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేవలం రూపాయికే ఇచ్చేందుకు కూడా బోర్డు సిద్దమైంది. ఈ స్కీంను అసలైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకునేలా స్వయం సహాయక బృందాలకు సరైన శిక్షణను కూడా ఇచ్చారు.

గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

హైదరాబాద్, ఏప్రిల్ 20: హైదరాబాద్ నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శోభ మాలి అనే మహిళ రెండేళ్లుగా కాచిగూడలో గోదాములు ఏర్పాటు చేసుకుని గంజాయి సప్లై చేస్తోంది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలించి రూ. 3వేలకు కిలో చొప్పున అమ్ముతోంది. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడకు చెందిన శోభ మాలి (32), ధూల్‌పేట్‌కు చెందిన మోతివాలె నరేష్ సింగ్ (35), పురానాపూల్‌కు చెందిన ప్రవీణ్ సింగ్ (40), ధూల్‌పేట్‌కు చెందిన దినేష్ సింగ్ (24) పోలీసుల అదుపులో ఉన్నారు. వీరి వద్ద నుంచి వంద కిలోల గంజాయి, 4 సెల్‌ఫోన్లు, ఒక హోండా ఆక్టివా స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి ఎన్ కోటిరెడ్డి తెలిపారు.