హైదరాబాద్

జిహెచ్‌ఎంసిలో ‘రవాణా’ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: మహానగరంలో ప్రతిరోజు పోగవుతున్న వేలాది టన్నుల చెత్తను శివారులోని డంపింగ్ యార్డుకు తరలించటంలో కీలక పోత్ర పోషించే జిహెచ్‌ఎంసి రవాణా విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే ప్రధాన కార్యాలయానికి మాత్రమే కేంద్రీకృతమై ఉన్న ఈ చెత్త తరలింపునకు సంబంధించిన అధికారులను జోన్ల స్థాయిలో వికేంద్రీకరించిన కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ విభాగంలో పనిచేస్తున్న ఫోర్‌మెన్, వెహికిల్ మెకానిక్ మొదలుకుని అసిస్టెంటు ఇంజనీర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, ఆసిస్టెంటు సిటివో స్థాయి అధికారులకు స్థానం చలనం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చెత్త తరలింపునకు సంబంధించిన వ్యయాన్ని తగ్గించేందుకు ప్రధాన కార్యాలయం నుంచి జోన్లకు కమిషనర్ అధికార వికేంద్రీకరణ చేసినా, కొన్ని పార్కింగ్ యార్డుల్లో నేటికీ ఖర్చులు స్వల్పంగా తగ్గటం, అక్రమాలు చోటుచేసుకోవటం, కొందరు అసిస్టెంటు సిటీవో స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు రావటం వంటి కారణాల నేపథ్యంలో వ్యవస్థను వికేంద్రీకరించి ఏడాది గడుస్తున్నా, సిబ్బందిని ప్రక్షాళన చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
అంతేగాక, కొన్ని చోట్ల చెత్తను తరలించే జిహెచ్‌ఎంసి వాహనాల కండీషన్ బాగానే ఉన్నా, వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి, వాటి స్థానంలో కొందరు అసిస్టంటు సిటీవోలు, పార్కింగ్ యార్డు కేర్ టేకర్లు అద్దె వాహనాలన ప్రోత్సహిస్తున్నట్లు కూడా కమిషనర్ దృష్టికి రావటంతో భారీగా బదిలీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. అంతేగాక, చాలా కాలంగా కొందరు అసిస్టెంటు ఇంజనీర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయి అధిక సంఖ్యలో వారి వాహనాలను ఏంగేజ్ చేస్తున్నార్న ఆరోపణ సైతం లేకపోలేదు. అంతేగాక, కొద్ది రోజుల క్రితం సెంట్రల్ జోన్‌లో నాలాల పూడికతీత పనుల్లో తీసిన పూడికను తరలించేందుకు వినియోగించిన వాహనాల తాలుకూ సుమారు రూ. కోటి 10లక్షల బిల్లుల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే! బిల్లులు క్లెయిమ్ చేసిన వాహనాలకు సంబంధించి కాంట్రాక్టర్లు ఇచ్చిన నెంబర్లను జిహెచ్‌ఎంసి సెంట్రల్ ఆడిట్ సెక్షన్ విచారణ చేయగా, ఆ వాహనాల నెంబర్లన్నీ కూడా ద్విచక్ర, ఆటో వంటి త్రి చక్ర వాహనాలకు చెందినవిగా నిర్థారణ అయ్యాయి. ఈ రకంగా రవాణా విభాగంలో కూడా మూలనపడేసిన జిహెచ్‌ఎంసి వాహనాల పేరిట బిల్లులు డ్రా అవుతున్నట్లు, కొన్ని సందర్భాల్లో విడి భాగాలను కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చినందున రవాణా విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

‘ప్రాచీన కవిత్వంలో నారదుడు’
కాచిగూడ, ఏప్రిల్ 21: బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు అని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు జ్వాలా నరసింహారావు అన్నారు. వంశీ విజ్ఞాన పీఠం, ద్వానా సాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో డా. ద్వానాశాస్ర్తీచే తెలుగు పాఠం భాగంగా ‘ప్రాచీన కవిత్వంలో నారదుడు’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నరసింహారావు మాట్లాడుతూ నారదుడు త్రిలోకసంచారి అవడంతో లోకజ్ఞాని కీర్తించారు. డా.ద్వానాశాస్ర్తీ ప్రాచీన కవిత్వంలో నారదుడు అనే అంశంపై ప్రసంగించారు. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, డా.తెనే్నటి సుధాదేవి పాల్గొన్నారు.