హైదరాబాద్

అవకాశం కోసం కాచుకున్నకాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: అధికారంలో ఉండగా ప్రజలకేమీ చేయని కాంగ్రెస్ పార్టీ ముసలి నక్కలాంటి పార్టీ అని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. అంతేగాక, సర్కారును విమర్శించే అవకాశం కోసం కాంగ్రెస్ కాచుకుని కూర్చోందని, ఆ పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన సూచించారు. శనివారం ఆయన నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గంలోని జివైఆర్ కాంపౌండ్ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఏ రకంగా కూడా ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను చేసిన ముఖాలు కాంగ్రెస్‌వి కావని, వారు రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని, ఏదో ఉద్దరిస్తామని చెబుతున్నారని, అధికారం కోసం ఎక్కడ సందు దొరుకుందా? అని ఆ పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. నేడు జివైఆర్ కాంపౌండ్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నామని, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణ పనులను చేపడుతామని వెల్లడించారు. ప్రజలకు కూడా నేడు మాకు ఇళ్లు సమకూరాయని, మిగిలిన ప్రాంతాలకు స్కీం అమలవుతుందని చెప్పాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో నూటికి తొంభై మంది డబుల్ బెడ్ రూం ఇళ్లకు అంగీకరించి ముందుకొస్తుంటే ఒక పది శాతం మంది వెనకడగు వేస్తున్నారని, వారిని విస్మరించలేమని ఆయన వెల్లడించారు. ఈ రకంగా పేద ప్రజలను వెతికిపట్టుకుని వారికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇళ్లో, పెన్షనో ఇస్తూ లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, సర్కారు చేస్తున్న మంచి పనులు తమకు కనబడనట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.