హైదరాబాద్

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 22: తాగునీటిని సరఫరా చేయండి మహాప్రభో..అంటూ కాలనీ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. శనివారం ఉదయం షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని రాంనగర్ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. షాద్‌నగర్-కొత్తపేట రోడ్డుపై రాళ్లు, ముళ్ల కంపను పెట్టి బైఠాయించారు. 15రోజుల నుండి నీటి సమస్య తీవ్రంగా ఉందని, నల్లాలు రావడం లేదని.. ఇళ్లల్లో ఉన్న బోర్లలో నీరు రావడం లేదని.. దీంతో తాము ఎలా బతకాలి అంటూ కాలనీవాసులు రాములునాయక్, బాల్‌రాజ్, పద్మమ్మ, స్వప్న, సంతోష్, శ్రీ్ధర్, రాజు, లక్ష్మీ, గోరిలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను నివారించాలంటూ పురపాలక సంఘం అధికారులకు, స్థానిక కౌన్సిలర్‌కు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రోవాటర్ సంప్ నుండి రాంనగర్ కాలనీ మీదుగా పైపులైన్ వేశారు.. కానీ చుక్క నీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదేమని సిబ్బందిని ప్రశ్నిస్తే మాకేమీ తెలియదు.. అధికారులను అడగండి అంటూ దాటవేస్తున్నారే తప్ప నీటిని మాత్రం సరఫరా చేయడం లేదని అంటున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారే తప్పా ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు రోడ్డుపై నుండి పక్కకు జరిగే ప్రసక్తి లేదని కాలనీవాసులు భీష్మించుకొని కూర్చున్నారు.
ఈ విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఎస్‌ఐ దాసు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా కాలనీవాసులు ఎంతవరకు వినకపోవడంతో పురపాలక సంఘం అధికారులకు సమాచారం అందించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తే నీరు రాదనీ.. సంబంధిత కార్యాలయం వద్దకు వెళ్లి.. ప్రశ్నిస్తే నీళ్లు వస్తాయని కాలనీవాసులకు సూచించారు. రాంనగర్ కాలనీలో ఉన్న బోరుమోటార్లకు మరమ్మతులు చేసి సాయంత్రం వరకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని షాద్‌నగర్ పురపాలక సంఘం ఎఇ నరేష్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. బోర్లకు మరమ్మతులో చేయడంలో జాప్యం జరగడం వల్లే నీటి సరఫరా నిలిచిపోయిందని,సాయంత్రం వరకు పూర్తి చేసి నీటిని సరఫరా చేస్తామని వివరించారు.