హైదరాబాద్

మరో వారం రోజులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎర్లీబర్డ్’కు
దగ్గర పడుతున్న గడువు
ఇప్పటి వరకు
రూ. 190 కోట్లు వసూలు
మరో వంద కోట్లకు
అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ముందస్తుగా ఆస్తిపన్ను వసూలు చేసుకునేందుకు జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ స్కీం చక్కటి ఫలితాలనిస్తోంది. ఈ నెలాఖరులోపు వర్తమాన సంవత్సరం బకాయిలను చెల్లిస్తే అయిదు శాతం రాయితీనిస్తూ అమలు చేస్తున్న ఈ స్కీంకు గత సంవత్సరం కన్నా ఎక్కువ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ. 190 కోట్ల వరకు పన్ను వసూలు చేసుకున్న ఎర్లీబర్డ్ స్కీంకు మరో వారంరోజుల్లో తెరపడనుంది. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ స్కీంను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి కోరుతున్నారు. ఈ కార్యక్రమం కింద ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 18వేల మంది తమ ఆస్తిపన్ను బకాయిలను రూ. 15 కోట్ల మేరకు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఆన్‌లైన్‌లో చెల్లించిన వారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు వివరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ ఎర్లీబర్డ్ ఆఫర్ ఈ నెలాఖరుతో ముగియనుంది. గత సంవత్సరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో కూడా ఎర్లీబర్డ్ ఆఫర్‌ను అమలు చేశారు.
గత సంవత్సరం ఇదే తేదీ నాటికి రూ. 89 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శనివారం వరకు రూ. 190 కోట్ల వరకు పన్ను వసూలైంది. కాగా ట్రేడ్‌లైసెన్సు రెన్యువల్‌లకు కూ మంచి స్పందనే దక్కుతోంది. ట్రేడ్ లైసెన్సు రెన్యువల్‌లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2017-18కు సంబంధించి రెన్యువల్ ఫీజు కింద రూ. 12.78 కోట్లు వసూలయ్యాయి. ఈ నెల 30వ తేదీ దాటిన తర్వాత ట్రేడ్‌లైసెన్సులకు మే 1వ తేదీనుంచి 25 శాతం జరిమానా, జూలై మాసం నంచి 50శాతం జరిమానా విధించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్ను జిహెచ్‌ఎంసి కార్యాలయాల్లోని అన్ని సిటిజన్ సర్వీసు సెంటర్లు, మీ సేవా, ఈసేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌లోనూ, ఎంపిక చేసిన బ్యాంకుల బ్రాంచిల్లో గానీ, జిహెచ్‌ఎంసి మొబైల్ యాప్ ద్వారా గానీ చెల్లించవచ్చునని అధికారులు తెలిపారు.
ఈ ఆఫర్ ముగిసేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశముండటం, ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది చెల్లిస్తున్నందున మరో రూ.వంద కోట్ల నుంచి 150 కోట్ల వరకు వసూలై, ఈ ఏట ఎర్లీబర్డ్ కలెక్షన్ రూ. 300 కోట్లు దాటే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు.