హైదరాబాద్

పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: హైదరాబాద్ నగరంలో రద్దయిన పాత నోట్లు మార్పిడీ ముఠాను నార్త్‌జోన్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రం రద్దు చేసిన పాత నోట్లను మార్చుకోవడానికి గడువు ముగిసినా ఇంకా అవి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 42.70 లక్షల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన కె శ్రీనివాస్, కెపిహెచ్‌బి కాలనీకి చెందిన ఎ నరసింహా వర్మ, సనత్‌నగర్‌కు చెందిన ప్రశాంత్, ఎర్రగడ్డకు చెందిన మహమ్మద్ నసీరుద్దీన్ కమిషన్ రూపంలో పాత నోట్లను జమ చేసుకున్నట్టు ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ ఆర్‌బిఐ కార్యాలయం వద్ద కమిషన్ ఏజెంట్లుగా ఉంటూ పాత నోట్లను పోగేసుకున్నారు. వీరందరి నుంచి పాత నోట్లను సేకరించిన శ్రీనివాస్ అనే వ్యక్తి లక్ష రూపాయలు పాత నోట్లు తీసుకుని 60 వేలు కొత్త నోట్లను ఇచ్చేవాడు. తన వద్దనున్న పాత నోట్లను ఏదో రూపంలో ఆర్‌బిఐ కార్యాలయంలో మార్చుకోవాలని చూసినా వీలు పడలేదు. ఇలా పోగేసిన రూ. 42 లక్షల 70 వేలను పాత నోట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతనోట్లు అందుబాటులో ఉంచుకున్న నలుగురు వ్యక్తులపై ఆర్‌బిఐ చట్టం 2017 ప్రకారం కేసులు నమోదు చేశామని టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి తెలిపారు.