హైదరాబాద్

సైబర్ నేరగాళ్లపై అప్రమత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఏప్రిల్ 22: అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్జానంతో సైబర్ నేరగాళ్లు సవాళ్లు విసురుతున్నారని వారి పట్లు అప్రమత్తత అవసర మని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ఐటి యాక్ట్‌లోని చట్టసవరణలు వాటి ఉపయోగాలు అంశంపై సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి జంట కమిషనర్లు పాల్గొని ప్రసంగించారు.సందర్భంగా శాండిల్యా మాట్లాడుతూ ఇంటర్నెట్ మానవ జీవితంలో రెండు వైపులా పదునైన కత్తి వంటిదని అపప్రమత్తత లేకపోతే ఇబ్బందులు పడతామని హెచ్చరించారు. ఒక వైపు సాంకేతికతతో ప్రపంచమంత ఓ కుగ్రామంగా(గ్లోబల్ విలేజ్) మారితే అందుబాటులోకి వచ్చిన సాంకేతికను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు కొత్త సవాళ్లను విసురుతున్నారని వారి పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల పట్ల ఇంటర్నెట్ ఆయుధంగా మారిందని వారిని కట్టడి చేయడానికి పోలీసులు సైబర్ నేరాలపై అవగహన పెంచుకొవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి నెల చివరి శనివారం లాఅమెండ్ మెంట్ అండ్ అప్లికేషన్స్ పై సమావేశం నిర్వహించుకుందామని సందీప్ శాండిల్యా చెప్పారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ మాట్లాడుతూ తమ కమిషనరేట్ పరిధిలో సగటున రోజుకి నాలుగైదు సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయని తెలిపారు. నోట్ల రద్దు తరువాత సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ నేరాలు ఆధార్ లింక్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నైసీరియన్స్ వివిధ రూపాల్లో మోసాలు చేస్తు బ్యాంకు ఖాతాదారుల డబ్బును గల్లంతుం చేస్తున్నారని వివరించారు. ఇటీవల ఆన్‌లైన్‌లో మహిళలను వేధించే వారి సంఖ్య పురిగిందని బాధితులు భయపడి పీర్యాదు చేయాడానికి ముందుకు రావడంలేదని, పీర్యాదు చేసిన బాధితుల వివరాను గోప్యంగా ఉంచుతామని మహేష్ భగత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌కు ప్రత్యుక సైబర్ క్రైం పోలీసు స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రస్తుతం ప్రత్యేక ఐటి సాఫ్ట్‌వేర్లను కొనుగోలు చేశామని తెలిపారు. సైబర్ నేరగాళ్లను కట్టిడి చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. అనంతరం తెలంగాణ ఎపి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఎస్, రాము మాట్లాడుతూ రాన్నున కాలంలో ఆయుధలతో యుద్ధాలు జరగవని కంప్యూటర్లతో జరగుతాయన్నారు. పెరిగిన టెక్నాలజీ వల్ల ప్రస్తుతం ఈగర్నెన్స్, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ సంతకాలు వలన పనులు సులువుగా జరుగుతున్నాయని తెలిపారు. అయితే వీటి ద్వారా కూడా కొన్ని సమస్యలు లేకపోలేదన్నారు. ఐటి చట్టంలో వివిధ సెక్షన్ల గురించి వివరించారు. సైబర్ నేరాలు, హ్యాకింగ్, సైబర్ స్టాకింగ్, స్పామింగ్,సైబర్ ప్రొర్నోగ్రఫీ, ఫిషింగ్, సోఫ్ట్వేర్ పైరసీ, కార్పోరేట్ ఎస్పీయోనేజ్, మనీ లాండరింగ్ పాస్వర్డ్ స్నిఫింగ్, క్రెడిట్ కార్డ్‌ఫ్రాడ్, వెబ్‌జాకింగ్, సైబర్ టెర్రరిజమ్ వంటి వాటి గురించి పోలీసులకుసదస్సులో వివరించారు. ఈకార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ షానవాజ్ ఖాసిం, సైబర్ క్రైం ఏసిపిలు జయరాం, రవీందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ వైజయంతి, సాంబశివ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.