హైదరాబాద్

భోలక్‌పూర్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఏప్రిల్ 23: నగరం నడిబొడ్డులోని భోలక్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం ఓ తోళ్ల లోడ్ లారీ రివర్స్ చేస్తుండగా ఓ ఇంటి గోడ కూలింది. అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు బాలుళ్లపై గోడ పడడంతో ఓ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే.. భోలక్‌పూర్ బిస్మిల్లా హోటల్ లేన్‌లో తోళ్ల లోడ్‌తో వచ్చిన ఓ భారీ వాహనం నెం. ఎపి 36టిఎ 4057ను రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటి ముందు భాగంలో నున్న గోడ కూలింది. అక్కడే ఆడుకుంటున్న చిరువ్యాపారి సుల్తాన్ కుమారుడు బిలాల్ (12), మరో బాలుడు సలీమ్ హుస్సేన్ లపై గోడ పడటంతో బిలాల్ అక్కడికక్కడే మృతి చెందగా, సలీమ్ హుస్సేన్ గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్ ఆఖిల్ అహ్మద్, భోలక్‌పూర్ డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ప్రఫుల్ రాంరెడ్డి, స్టాడింగ్ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్‌రెడ్డి, ముషీరాబాద్ ఇన్స్‌పెక్టర్ రాంచంద్రారెడ్డి సంఘన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా మృతుడు బిలాల్ (ఆరుగురు ఆడపిల్లల తరువాత) ఆఖరి సంతానం కావడంతో అతని కుటుంబం విషాదం నెలకొంది, కన్నీటి పర్యంతమైన ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలావుండగా నివాస గృహాల్లో నిర్వహిస్తున్న తోళ్ల పరిశ్రమలను తరలించాలంటూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. భోలక్‌పూర్‌లో గల తోళ్ల పరిశ్రమలను తరలించాలని ఎన్నో ఏళ్లుగా విన్నవించుకుంటున్నా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారం జరిపి తన కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి తండ్రి సుల్తాన్ భోరున విలపించిన తీరు స్థానికులను కంట తడి పెట్టించింది.