హైదరాబాద్

దమ్మున్న ముఖ్యమంత్రి కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, ఏప్రిల్ 23: రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులలో దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొడంగల్‌లోని రాఘవేంద్ర పంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అధ్యక్షతన టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅథితిగా మంత్రి పాల్గొని మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని 18 ముఖ్యమంత్రులు పరిపాలించిన రాష్ట్రంలో ఎలాంటి పురోగతి సాధించలేరన్నారు. ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొద్దిరోజుల్లోనే కెసిఆర్ అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లారని అన్నారు.
12 సంవత్సరాలు ఉద్యమాలతో పోరాటాలు సాధించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. గులాబీ కండువాకు భయపడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు పాలించిన టిడిపి కూడా రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ 200 పింఛన్‌లను 1000 రూపాయలకు పెంచి, 6కిలోల రేషన్ బియ్యం, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి తదితర సంక్షేమ పధకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులను ఆదుకోవడానికి లక్ష రూపాయలకు ఉన్న రుణామాఫిని 4 విడతలుగా మాఫిచేసి రానున్న రోజులలో 4 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి నీరు ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. 2018 డిసెంబర్ 31వ తేది నుంచి యధావిధిగా 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం జరుగుతుందన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. ప్రదానంగా నీరు నిధులు, నియామకాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అదేవిధంగా గర్భిణులకు 12 వేలతో పాటు కిట్లను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజులలో టిఆర్‌ఎస్ పార్టీని తట్టుకునే పార్టీ లేదని పార్టీ ఉన్నంత వరకు టిఆర్‌ఎస్ వారే ముఖ్యమంత్రులుగా కొనసాగుతారన్నారు. ఇది వరకే సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పౌరుషాన్ని ఢీ కొట్టడానికి సభ్యత్వాన్ని నమోదు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అందుకుగాను ఈ నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సభకు నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలిపారు.
సమావేశంలో పట్టణ సర్పంచ్ వెంకట్‌రెడ్డి దేశ్‌ముఖ్, పిఏసిఎస్ చైర్మెన్ బస్వరాజ్‌లతో పాటు నాయకులు కృష్ణ, గోడల రాంరెడ్డి, మధుసూదన్‌యాదవ్, అన్నకిష్టప్ప, రామకృష్ణ, సిసి వెంకటయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు నంది గెస్ట్‌హౌస్‌లో నియోజకవర్గంలోని ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఆధిపత్య పోరు.. మనస్థాపంతో
టిఆర్‌ఎస్ కార్యకర్త ఆత్మహత్య
రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: పార్టీలో ఆధిపత్యపోరుతో మనస్థాపం చెందిన ఓ టిఆర్‌ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. షాద్‌నగర్ రామేశ్వరం జోగన్నగూడెం ప్రాంతానికి చెందిన పుంటికూర మహిపాల్‌రెడ్డి(35), రాణి దంపతులు బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం మైలార్‌దేవ్‌పల్లికి వచ్చారు. ప్రగతికాలనీలో నివాసముంటున్న వీరికి ఇద్దరు సంతానం. స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ గ్రేటర్ ఎన్నికల సమయం నుంచి టిఆర్‌ఎస్‌లో చురుగ్గా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం మహిపాల్‌రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణానికి ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్లాడు. తన వెంట తీసుకెళ్లిన ప్లాస్టిక్ తాడుతో యూనివర్సిటిలో ఉండే బోర్ పైపునకు తాడును బిగించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం వాకింగ్‌కు వచ్చినవారు గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ సిఐ ఉమేందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి మృతుడి జేబులో ఉన్న లెటర్ ద్వారా వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పార్టీలో ఆధిపత్య పోరు
భరించేలేక..
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టిఆర్‌ఎస్‌లో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవడంతో కింది స్థాయి కార్యకర్తలు నలిగిపోతున్నారు. మొదటి నుంచి ఉన్న నాయకులు, ఇటీవల తెదేపా నుంచి పార్టీలోకి వచ్చిన నాయకులకు మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో కింది స్థాయి కార్యకర్తలు పార్టీకి పనిచేయాలో? వద్దా? అనే మీమాంసలో పడ్డారు. ఇరువర్గాలలో ఎవరికి పని చేయాలో అర్థంకాక సతమతం అవుతున్నారు. కాగా పార్టీ నాయకత్వం ఇరువర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ కింది స్థాయి కార్యకర్తలను అయోమయంలో పడేస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్థాపం చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మహిపాల్‌రెడ్డి సూసైడ్ నోట్‌లో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పార్టీ అధిష్ఠానం జోక్య చేసుకొని ఆధిపత్య పోరు లేకుండా చూడాలని మృతుడు మహిపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ అగ్రనాయకత్వాన్ని తన చివరి కోరికగా పేర్కొన్నాడు. మహిపాల్‌రెడ్డి సూసైడ్ నోట్ తెలిపినట్లుగా ఆధిపత్య పోరుతో మృతిచెందాడా..లేదా.. మరేదైనా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ తెలిపారు.
బాధిత కుటుంబాన్ని
ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి
ఆత్మహత్య చేసుకున్న మహిపాల్‌రెడ్డి మృతదేహాన్ని రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తోకల శ్రీశైలంరెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, మహిపాల్‌రెడ్డి కుటుంబానికి పార్టీ అండదండలు ఎప్పటికీ ఉంటాయన్నారు.

శ్రీలక్ష్మీనృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
మేడ్చల్, ఏప్రిల్ 23: కీసర మండలం చీర్యాల ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నృసింహ్మ స్వామివారి దేవస్థానం నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం చక్రస్నానంతో వైభవంగా ముగిశాయి. నాలుగు రోజులుగా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు సంపూర్ణమయ్యాయి. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకుడు నలందిగర్ నరసింహచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి శతఘటాభిషేకం నిర్వహించిన అర్చకులు పంచహారతులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
శ్రీచక్ర అల్వార్ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీలక్ష్మీ నారసింహ్మ గోవింద నామస్మరణల నడుమ స్వామివారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానాన్ని నిర్వహించారు. ఉదయం సాయంత్రం శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రపారాయణం నిర్వహించారు. శ్రీ సుదర్శన నారసింహ యాగం పుర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి దంపతులు పాల్గొన్నారు. స్వామివారి బ్రహోత్సవాల వైదిక కార్యక్రమాలలో సేవలందించిన పండితులను దేవస్థాన కమిటకీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

చరిత్ర నిర్మాణంలో దళిత బహుజనులదే కీలక పాత్ర
నాచారం, ఏప్రిల్ 23: చరిత్ర నిర్మాణంలో దళిత బహుజనుల పాత్రతో మరో చరిత్రకు వారథులుగా మిగిలిపోతారని మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కంచె ఐలయ్య అన్నారు. ఓయు శతాబ్ది ఉత్సవాలకు సంఘీభావంగా దళిత బహుజనుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రజాగాయకుడు గద్దర్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపి మధుయష్కి గౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ప్రొఫెసర్ కుమార్‌స్వామి పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నిర్మాణంలో దళిత బహుజన కార్మికులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.