హైదరాబాద్

ఖాళీ స్థలాలు.. క్రీడా మైదానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: మహానగరంలో ఖాళీ స్థలాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, వౌలిక వసతులను కల్పించి క్రీడామైదానాలుగా తీర్చిదిద్దనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. అంతేగాక, వీటిని జాతీయ, అంతర్జాతీయ ఆస్థయి క్రీడా పోటీల నిర్వాహణకు అనుకూలంగా ఉంటే స్టేడియంలుగా ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి నిర్వహిస్తున్న వేసవి క్రీడాశిక్షణ శిబిరాన్ని కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని క్రీడానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. వీటికి తోడు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఖాళీ స్థలాల్లో కనీసం వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి క్రీడామైదానాలుగా రూపొందించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నగరంలో క్రీడ అభివృద్ధికి జిహెచ్‌ఎంసి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, ఇందుకు గాను అవసరమైతే మరిన్ని నిధులను కూడా కేటాయిస్తామన్నారు. జిహెచ్‌ఎంసితో పాటు ఇతర సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో కూడా క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తామని మేయర్ వెల్లడించారు. జిహెచ్‌ఎంసి వేసవి శిక్షణ శిబిరాలకు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందన్నారు. ఈ శిబిరాల ద్వారా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగారని గుర్తుచేశారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరంలో 2వేల 65 మంది జాతీయ, అంతర్జాతీయ, సీనియర్ కోచ్‌లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆరు సంవత్సరాల నుంచి 16 ఏళ్ల లోపు వయస్సు గల బాలబాలికలకు ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణనిప్పించనున్నట్లు తెలిపారు. ఈ సారి దాదాపు లక్షన్నర మందికి శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసిలో ప్రస్తుతం 521 క్రీడామైదానాలు, ఏడు స్విమ్మింగ్ పూల్స్, 13 స్పోర్ట్స్ కాంప్లెక్సులు, ఏడురోలర్స్ స్కేటింగ్ రింగ్‌లు, అయిదు టెన్నీస్ కోర్టులున్నాయని, వీటిలో కేవలం నామమాత్ర రుసుముతో ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. గత 49 సంవత్సరాల నుంచి నేటి వరకు ఈ శిబిరాలను నిరాటంకంగా నిర్వహిస్తుస్తూ ఇప్పటి వరకు 32లక్షల మందికి వివిధ క్రీడాంశాల్ల శిక్షణ అందించినట్లు తెలిపారు. జోనల్ కమిషనర్ హరిచందన, స్థానిక కార్పొరేటర్ మమత గుప్తా కూడా ప్రసంగించిన ఈ కార్యక్రమంలో శిక్షణ కోసం వచ్చిన బాలబాలికలు మార్ట్ఫ్‌స్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి శిక్షణ శిబిరం 2017పై ప్రత్యేకంగా రూపొందించిన సంచికను మేయర్ రామ్మోహన్ ఆవిష్కరించారు.
వేళలు మరింత పెంచండి
క్రీడా విభాగంతో భేటీలో కమిషనర్ ఆదేశం
వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం అనంతరం కమిషనర్ జనార్దన్ రెడ్డి క్రీడా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అనేక స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియంలను కేవలం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు, తిరిగి సాయంఅతం నాలుగు నుంచి ఆరున్నర గంటల్లోపు మాత్రమే ఉపయోగిస్తున్నారని, వీటి సమయాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. అంతేగాక, ఈ స్టేడియంలను, స్పోర్ట్స్ కాంప్లెక్సులను పే అండ్ యూజ్ పద్దతిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు, ఈ అంశంపై మరింత విస్త్రృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు. అంతేగాక, ప్రతి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో ఫీడ్‌బ్యాక్ రిజిస్ట్రర్లను తప్పకుండా ఏర్పాట చేయాలని, విద్యుత్ ఆదా కోసం ఎల్‌ఇడి లైట్లను వినియోగించాలని కమిషనర్ సూచించారు.