హైదరాబాద్

దుర్గం చెరువు చుట్టూ ట్రా'ఫికర్’కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 184 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి
మంత్రి కెటిఆర్‌చే
నేడు శంకుస్థాపన
సమీపంలోనే
నాలుగు లేన్ల కారిడార్

హైదరాబాద్, ఏప్రిల్ 25: నగరంలో ఐటి సంస్థల మధ్య పర్యాటక ప్రాంతంగాలో పేరుగాంచిన దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ధుర్గం చెరువు వరకు, చెరువు అటువైపు నుంచి మరిన్ని ప్రాంతాలకు ప్రస్తుతం రాకపోకలు సాగించటం గగనంగా మారిన సంగతి తెలిసిందే! ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేకూర్చేందుకు సుమారు రూ. 187.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ఈ చెరువుపై ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి చేతుల మీదుగా నేడు ప్రారంభించనున్నారు. రూ. 184 కోట్ల వ్యయంతో 365 మీటర్ల పొడువునా ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయి బ్రిడ్జి అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి అవకాశమేర్పడుతోంది. ప్రధానంగా రోడ్ నెం. 36లో నిరంతరం ఎదుర్కొనే ట్రాఫిక్ జాం వంటి సమస్యకు సైతం శాశ్వతంగా పరిష్కారం సమకూరనుంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ కేబుల్ వంతెన వల్ల ధుర్గం చెరువుతో పాటు పరిసర ప్రాంతాలు సైతం పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. అంతేగాక, ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలీ ప్రాంతాల మధ్య రాకపోకల కనెక్టివిటీ కూడా పెరుగుతోంది.
రూ.3.5కోట్లతో సుందరీకరణ
కుతుబ్‌షాహీ(1518-1687)ల హయంలో నిర్మించిన ఈ దుర్గం చెరువు గోల్కొండ కోటకు ప్రధాన మంచినీటి వనరుగా ఉండేది. 1970లో పిడబ్ల్యుడి శాఖ ఈ చెరువును పునరుద్దరించింది. 184 ఎకరాల ఆయకట్టు కల్గిన ఈ చెరువును సీక్రెట్ చెరువు అని కూడా అంటారు. అయితే కాలుష్య కాసారంగా మారి, దురాక్రమణలకు గురైన ఈ అందమైన చెరువును ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ చెరువు అభివృద్ధికి పలు ప్రముఖ ఐటి కంపెనీలు కూడా సహాయానికి ముందుకొచ్చాయి. నేడు కేబుల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయటంతో పాటు సుమారు రూ. 3.5 కోట్లతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ పనులు కూడా మంత్రి ప్రారంభించారు.
* సుందరీకరణ పనుల్లో భాగంగా రూ. 50.80 లక్షల వ్యయంతో చెరువులోని గుర్రపుడెక్క ఆకును తొలగించటంతో పాటు చెరువున శుద్ధి చేయనున్నారు. ఇందుకు గాను ప్రముఖ ఐటి కంపెనీ రహేజా ఐటి పార్కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 50.80 లక్షలను కేటాయించింది. పనులు కూడా కొనసాగుతున్నాయి.
* రూ. 2 కోట్లతో ధుర్గం చెరువు చుట్టూ 2.20 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే పార్కు, యోగా కేంద్రం ఇతర సుందరీకరణ పనులను చేపట్టనున్నారు. ఇందుకు జిహెచ్‌ఎంసి రూ. 2 కోట్లను విడుదల చేసేందుకు పరిపాలనపరమైన ఆమోదం కూడా ఇచ్చింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి పనులను చేపట్టనుంది.
* 3వేల పై చిలుకు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఈ చెరువులో సుమారు రూ. 90లక్షల వ్యయంతో కోనేరును నిర్మించనున్నారు. జిహెచ్‌ఎంసి నిధులతో చేపట్టనున్న ఈ కోనేరు నిర్మాణానికి టెండర్లను పూర్తి చేసి వచ్చే నెలలో పనులను చేపట్టనున్నారు.
అనుసంధానంగా మరో కారిడార్
ధుర్గం చెరువుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జితో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం పరిష్కారం కావటంతో పాటు ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచిదుర్గం చెరువు వరకు సుమారు రూ. 82.14 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల మరో కారిడార్‌ను కూడా నియమించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి ధుర్గం చెరువు వరకు ఈ కారిడార్ ద్వారా వాహనాలు ఎలాంటి ఆటంకాల్లేకండా చేరుకుని, ఆ తర్వాత చెరువుపై నిర్మించే వంతెన ద్వారా వేగంగా ముందుకెళ్లిపోయేందుక వీలుగా అనుసంధానంగా ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నందున రోడ్ నెం. 45, హైటెక్ సిటీలపై ప్రస్తుతమున్న ట్రాఫిక్ భారం చాలా వరకు తగ్గి, రాకపోకలు సులభతరమవుతాయి. ఈ కారిడార్ నిర్మాణానికి నేటి నుంచి జిహెచ్‌ఎంసి అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు. తిరిగి వచ్చే నెల 4న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, 22వ తేదీన టెండర్లను ఖరారు చేసి పనులను అప్పగించనున్నారు.