హైదరాబాద్

ప్రభుత్వ వ్యవస్థలో రెవెన్యూ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ప్రభుత్వ వ్యవస్థలోని అన్ని శాఖల కన్నా రెవెన్యూను బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పనిలో వేగాన్ని పెంచాలని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ సూచించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో విఆర్వోలకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన డిప్యూటీ సిఎం ట్యాబ్‌లు, పిసిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కువ బాధ్యతలతో పాటు ఎక్కువ పని రెవెన్యూ విభాగంలోనే ఉంటుందని, సర్కారు అమలు చేసే ముఖ్యమైన సంక్షేమ పథకాల అమలు ఈ శాఖ పరిధిలోకే వస్తుండటంతో ఈ విభాగంలోని ప్రతి అధికారి, సిబ్బంది కూడా చక్కటి జవాబుదారి తనంతో పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను సకాలంలో అమలు చేస్తూ అధికారులు, సిబ్బణది ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రమశిక్షణకు తోడు అంకితభావాన్ని కూడా అలవర్చుకుని ఆపన్నులకు సేవ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. పనులు గానీ, ఆసరా పెన్షన్లు, బోర్‌వెల్స్ అనుమతులు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి స్కీంలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో చేయాల్సిన వెరిఫికేషన్ వంటివి త్వరితగతిన పూర్తి చేసేందుకే ఈ ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారికి అవసరమైన సౌకర్యాలు, నిధులను అందించటంలో ముందుంటుందని ఆయన వివరించారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములకు సంబంధించి ఫెన్సింగ్ వేసేందుకు ప్రభుత్వాన్ని రూ. 9 కోట్లు కోరగా, ఇందులో మూడు కోట్లు మంజూరీ ఇచ్చిందని మిగిలిన మరో రూ. 6 కోట్ల విషయాన్ని ఇంఛార్జి కలెక్టర్ ప్రస్తావించగా, ఆ నిధులను వెంటనే మంజూరు చేయిస్తానని డిప్యూటీ సిఎం హామీ ఇచ్చారు. దేశంలో మొత్తంలో మన రాష్టమ్రే వెల్ఫేర్ స్టేట్‌గా పేరుగాంచిందని, ఇలాంటి రాష్ట్రంలో పనిచేస్తున్న మీరంతా మీకిచ్చిన నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. జేసి ఎం.ప్రశాంతి మాట్లాడుతూ విఆర్వోలకు ఇచ్చిన ట్యాబ్‌లతో ఆసరా పెన్షన్ దారుల ఆధార్ సీడింగ్, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆదాయ, కుల ధృవీకరణ వెరిఫికేషన్ తదితర పనులను మానిటర్ చేయవచ్చునని అన్నారు.
ముఖ్యంగా రెగ్యులరైజేషన్‌కై దరఖాస్తు చేసుకున్న వారి భూములు, ఇళ్లు చిత్రాలను తీసి వాస్తవాలను నిర్థారించుకోవచ్చునని తెలిపారు. డిఆర్వో సతీష్‌చంద్ర మాట్లాడుతూ హైదరాబాద్ కలెక్టరేట్ భవనం శిధిలావస్థల ఉందని, రాష్ట్ర రాజధానిలో గల ఈ కార్యాలయానికి, అదే విధంగా జిల్లాలోని వివిధ శాఖల కార్యాలయాలకు కలిపి సమీకృత భవనాన్న నిర్మించేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్డీవో చంద్రకళ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మధుమోహన్, శ్రీ వత్సకోత, లా అధికారి సంగీత తదితరులు పాల్గొన్నారు.