హైదరాబాద్

నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారీ ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారీ ముఠా గుట్టు రట్టయింది. ఆటో ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్లు తయారు చేసి సరఫరా చేస్తున్న ముగ్గురిని బుధవారం నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వివిధ కంపెనీలకు చెందిన 15 నకిలీ ఆటో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, ఒక స్కానర్, కలర్ ప్రింటర్, మానిటర్, సిపియు, మూడు మోబైల్ ఫోన్లతోపాటు రూ. 9,320లు నగదు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి తెలిపారు. సనత్‌నగర్ చెందిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు జి సత్యనారాయణ, తిరుమలగిరికి చెందిన ఆర్టీఓ ఏజెంట్ ఏ విశే్వశ్వరరావు, బేగంబజార్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ ప్రైవేట్ ఆర్టీఓ ఏజెంట్ ముగ్గురు స్నేహితులు. కాగా, ఆర్టీఓ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న విశే్వశ్వరరావు, ప్రేమ్‌కుమార్, ఎర్రమంజిల్‌లో స్టేషనరీ, జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్న సత్యనారాయణ వద్ద ఆటోల ఆర్సీ రెన్యువల్, ఫిట్‌నెస్ డాక్యుమెంట్ల ఫారాలను కొనుగోలు చేస్తారు.
అయితే వీరికి కుటుంబ పోషణకు సరిపడు ఆదాయం రాకపోవడంతో నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారు చేయాలని దురాశ కలిగింది. దీంతో సత్యనారాయణ వద్ద ఉన్న సామగ్రిని వినియోగించి నకిలీ ఆధార్, ఇన్సూరెన్స్, ఆర్సీలను తయారు చేసి ఒక్కొక్క సర్ట్ఫికెట్‌కు రూ. 5,000ల నుంచి రూ. 6,000ల వరకు వసూలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఎల్‌అండ్‌టి, భారతి ఆక్సా, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, టాటా ఏఐజి ఆటో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన ఫర్మెట్లను డౌన్‌లోడ్ చేసుకుని ఫొటో వెబ్‌డిజైన్‌లో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు.
ఇటీవల పోలీసులకు చిక్కిన డాక్యుమెంట్లను పరిశీలించగా ఇవి అసలు కాదు..నకిలీవని తేలింది. దీంతో వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డిసిపి వై లింబారెడ్డి వివరించారు.