హైదరాబాద్

సిటీకి ల్యాండ్‌మార్క్‌గా దుర్గం చెరువు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: చారిత్రక కట్టడం గోల్కొండకు నాడు తాగునీటిని అందించిన ధుర్గం చెరువును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, నగరానికి ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. రూ.3.5కోట్లతో చేపట్టిన ధుర్గం చెరువు సుందరీకరణ పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న జనాభా, ట్రాఫిక్, రద్దీకి అనుకూలంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిఎం ప్రత్యేక విజన్‌తో ఉన్నారని వివరించారు. ఈ చెరువు అభివృద్ధికి పలు ప్రముఖ ఐటి కంపెనీలు కూడా సహాయానికి ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. సుందరీకరణ పనుల్లో భాగంగా రూ. 50.80 లక్షల వ్యయంతో చెరువులోని గుర్రపుడెక్క ఆకును తొలగించేందుకు ప్రముఖ ఐటి కంపెనీ రహేజా ఐటి పార్కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 50.80 లక్షలను కేటాయించిందని మంత్రి వివరించారు. దీంతో ఈ చెరువు సుందరీకరణ పనులు రెండో దశగా కింద రూ. 4 కోట్ల వ్యయంతో ఆంఫి ధియేటర్‌ను నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. రూ. 2 కోట్లతో ధుర్గం చెరువు చుట్టూ 2.20 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే పార్కు, యోగా కేంద్రం ఇతర సుందరీకరణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ధుర్గంచెరువుపై బ్రిడ్జి నిర్మాణంతో రోడ్ నెం. 45 నుంచి రూ. 82.14 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు, ఇందుకు టెండర్ల ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. వీటితో పాటు రూ. 90 కోట్ల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.