హైదరాబాద్

వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 26: ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా బాలబాలికలు కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్టేడియంలో బుధవారం దక్షిణ మండలం జిహెచ్‌ఎంసి వేసవి క్రీడా శిక్షణి శిబిరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ మండలం పరిధిలోని వివిధ పాఠశాలలు, ప్లేగ్రౌండ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు చెందిన దాదాపు రెండువేల మంది బాలబాలికలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో స్టేడియం క్రీడా సంబురాన్ని తలపించింది. బాలబాలికలు ప్రధర్శించిన కరాటే, బాక్సింగ్ వంటి క్రీడా విన్యాసాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చార్మినార్ ఎమ్మెల్యే మహ్మద్ పాషాఖాద్రి, దక్షిణ మండలం జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, చార్మినార్ ఎసిపి అశోక్‌చక్రవర్తి, డిఎంసిలు ఎన్.యాదగిరి, టి.దశరత్, అసిస్టెంట్ స్పోర్ట్స్ డైరెక్టర్ కెడి శ్యామ్‌రాజ్ పాల్గొన్నారు. మార్చ్‌పాస్ట్‌లో మొగల్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాక్సింగ్ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, చందులాల్ బరాధారి స్పోర్ట్స్ కాంప్లెక్స్, దారుల్‌షిఫా ఫుట్‌బాల్ గ్రౌండ్, గౌలిపురా బాక్సింగ్ సెంటర్ జట్టు, సిసిఓబి బాక్సింగ్ సెంటర్ జట్టు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. మార్చ్‌పాస్ట్‌లో విజేతలకు దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాషాఖాద్రి ట్రోఫీలను అందజేశారు.