హైదరాబాద్

ముమ్మరం కానున్న తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: మహానగరంలో నిబంధనలకు విరుద్దంగా వెలసిన హోటళ్లు, మెస్‌లు, రెస్టారెంట్లపై కొరడా ఝుళిపిస్తూ జిహెచ్‌ఎంసి చేస్తున్న ఆకస్మిక తనిఖీలు, దాడులు మున్ముందు మరింత ఉద్దృతం కానున్నాయి. పార్లమెంటు సభ్యుడు జె.సి.దివాకర్‌రెడ్డి ఆధ్యక్షతన ఏర్పాటైన ఈ పార్లమెంటరీ స్టాండింగ్ నాణ్యమైన ఆహారాన్ని అందించటంలో నగర పాలక సంస్థలు కీలక పాత్ర వహించాలని పేర్కొనటమే గాక, తనిఖీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కమిటీ ఆదేశించింది. ఈ దిశలో హైదరాబాద్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా విక్రయిస్తున్న ఆహారాన్ని, హోటళ్ల పరిశుభ్రత, జిహెచ్‌ఎంసి ధృవీకరించిన మాంసాన్ని మాత్రమే ఉపయోగించేలా ప్రస్తుతం చేపడుతున్న తనిఖీలకు మున్ముందు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే అవకాశాల్లేకపోలేవు. అంతేగాక, తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందు నుంచి సమైక్యాంధ్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సర్కిల్‌కు ఒకరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలన్న ప్రతిపాదన కూడా ప్రస్తావనకు రాగా, ఇందుకు చీఫ్ సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కావల్సిన స్థాయిలో సిబ్బంది సమకూర్చితే కమిటీ సూచించిన విధంగా ఈ తనిఖీల ప్రక్రియను నిరంతరం కొనసాగించేందుకు కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా సానుకూలతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం జిహెచ్‌ఎంసి ఆర్థిక సంక్షోభంలో ఉన్నపుడు ఆదాయాన్ని పెంచుకునేందుకు అవకాశమున్న మార్గలన్నీ ఉపయోగించుకోవటంలో భాగంగా చేపట్టిన ఈ తనిఖీలు ఇక నిరంతరం కొనసాగించాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. ముఖ్యంగా మాంసాహారంలో నాణ్యత లేకపోవటం, తాగునీటిలో స్వచ్ఛత లోపించటం వల్లే ఎక్కువ రోగాలు వస్తున్నాయని భావిస్తున్న జిహెచ్‌ఎంసి మున్ముందు జిహెచ్‌ఎంసి స్లాటర్ హౌజ్‌లు ధృవీకరించిన మాంసానే్న వినియోగించాలన్న నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశముంది.