హైదరాబాద్

జిహెచ్‌ఎంసి పరిధిలో.. మార్చి రెండు వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ పరిధిలో వివిధ చోట్ల విద్యుత్ పంపిణీ వ్యవస్ధను బలోపేతం చేసేందుకు మరమ్మతు పనులు, నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్ధ ప్రకటించింది. దీని వల్ల మార్చి 2వ వారం వరకు కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉంటాయని, కోతలు ఉంటాయని డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నిర్వహణ పనులు మార్చి రెండో వారంలోగా ముగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో గత సంవత్సరం ఎండాకాలంలో రికార్డు స్థాయిలో 53 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామన్నారు.
ఈ ఏడాది ఎండాకాలంలో 55 నుంచి 58 ఎంయు విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశామన్నారు. డిమండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా కోసం నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్ధను పటిష్టం చేస్తామన్నారు.
సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది విద్యుత్ సరఫరాలో ఏర్పడే సమస్యలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అప్రకటిత అంతరాయం ఏర్పడినట్లయితే 9440813333 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. హైదరాబాద్ నార్త్ సర్కిల్, సౌత్ సర్కిల్, సెంట్రల్ సర్కిల్, రంగారెడ్డి సౌత్, నార్త్, ఈస్ట్ సర్కిల్స్‌కు అవసరమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
వివిధ నిర్వహణ పనుల్లో భాగమైన ఏబి స్విచ్‌ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్, కండక్టర్‌లనిర్వహణ వంటి పనులను యుద్ధప్రాతిపాదికన చేపట్టనున్నట్లు చెప్పారు.
కిలో టమాట రూపాయి
బోరుమంటున్న రైతులు
సరుకును వదిలేసి
వెళ్తున్న అన్నదాతలు
మిగిలిన కూరగాయలదీ
అదే దారి

చేవెళ్ల, ఫిబ్రవరి 16: ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయల పంటలకు మార్కెట్‌లో ధరలు లేకపోవడంతోవాటిని రైతులు అక్కడే పారబోసి వెళ్లిన దైన్య సంఘటన చేవెళ్ల మార్కెట్‌లో చోటుచేసుకుంది. ఇటీవల కేజీ 60 రూపాయల వరకు పలికిన టమాట ధర కిలో రూపాయి కూడా పలుకకపోవడంతో రైతులు వాటిని అలాగే వదిలేసి వెళ్లిపోతున్నారు. కూరగాయలను కనీసం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మందుకు రాకపోవడంతో రైతులు బోరుమంటున్నారు. మరికొందరు రైతులు పశువులకు మేతగా పారబోస్తున్నారు. చేవెళ్లలోని మార్కెట్ యార్డుకు చేవెళ్ల మండల రైతులతో పాటు షాబాద్, పూడూర్ మండలాల రైతులు ప్రతిరోజు కూరగాయలు తెస్తుంటారు. అయితే వారంరోజుల నుంచి చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌లోకి పెద్దమొత్తంలో టమాట బాక్స్‌లను రైతులు తీసుకొస్తున్నారు. కాగా, టమాట ధరలు పూర్తిగా పడిపోవడంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. చేవెళ్లలో ప్రతిరోజు మార్కెట్‌లో కూరగాయలు విక్రయాలు జరుగుతుంటాయి. అయితే టమాట బాక్స్‌లు రైతులు అధికంగా తెచ్చారు. దీంతో 25 కిలోల టమాట బాక్స్ రూ.20 నుండి 50 రూపాయల ధర పలికింది. రైతులు తెచ్చిన టమాట బాక్స్‌లు, వంకాయ, క్యాబేజి, సొరకాయ, బీరకాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో ఆ టమాట బాక్స్‌లు పూర్తిగా మార్కెట్‌లోనే వదిలివేశారు. వీటితో పాటు దాదాపు మిగిలిన కూరగాయలకు సైతం ధర లేకపోవడంతో రైతులు కన్నీరు కార్చుతున్నారు.
చేవెళ్ల మార్కెట్ యార్డులో గత వారం రోజులుగా టమాట బాక్స్‌లు అమ్ముడుపోకపోవడంతో 800కు పైగా టమాట బాక్స్‌లు అలాగే పడిఉన్నాయి. టమాటతో పాటు వంకాయ బస్తాలు, క్యాబేజి, బీరకాయ, ఆకుకూరలు సైతం అమ్ముడుపోకపోవడంతో పశువులకు మేతగా వేశారు. రైతులకు కనీసం రవాణా చార్జీలు కూడా చేతికందక పోవడంతో కమీషన్ ఏజెంట్ల వద్ద డబ్బులు అప్పుచేసి తిరుగుప్రయాణం అయ్యారు. ఎండకాలం మాదిరిగా ఉన్న సమయంలో సైతం కూరగాయలకు కనీస ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

45రోజులు .. రూ. 455 కోట్లు
ఆస్తిపన్ను టార్గెట్లు
నిర్ణయించిన కమిషనర్
సర్కిల్‌కు ఒకరు చొప్పున
24 మంది ప్రత్యేకాధికారులు
రోజుకి లక్ష్యం రూ. 10 కోట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: మహానగర పాలక సంస్థ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి బల్దియా బాసు అధికారులకు టార్గెట్లను ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు 545 కోట్ల వరకు పన్ను వసూలు కాగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగింపుకు మిగిలి ఉన్న మరో 45 రోజుల్లో టార్గెట్‌ను అధిగమించేందుకు అధికార యంత్రాంగం మరో రూ. 455 కోట్లను వసూలు చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అంటే రోజుకి కనీసం రూ. 10కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సర్కిళ్ల వారీగా వసూళ్లను పర్యవేక్షించేందుకు ప్రతి సర్కిల్‌కు ఓ ప్రత్యేకాధికారిని కూడా నియమిస్తూ ఆయన ఉతర్వులు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు వారి పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆస్తిపన్ను సేకరణకు ఈ ప్రత్యేక అధికారులు ఎప్పటికపుడు సమీక్ష నిర్వహించటంతో పాటు అధిక మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవటం, ఫోన్, ఎస్‌ఎంఎస్‌ణ ద్వారా, ఈ మెయిల్ ద్వారా వారికి సమాచారం పంపుతూ చెల్లించే విధంగా గుర్తుచేయటం వంటి ప్రత్యేక విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు, బిల్డింగ్ పినలైజేషన్ స్కీం దరఖాస్తుల జాబితాను పరిశీలించి పన్ను బకాయిదారులకు అవసరమైతే రెడ్ నోటీసులు జారీ చేయటం, వాటి తాలుకూ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించటం వంటివి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆస్తిపన్ను మందిపు కానీ భవనాలను గుర్తించటం, తక్కువ పన్ను ఉన్న భవనాలను గుర్తించి వాటికి నియమనిబంధనలను అనుసరించి పన్నును వర్తింపజేయాలన్నారు. భారీగా పన్ను బకాయిలు ఉన్న ప్రభుత్వం శాఖల నుంచి ఆస్తిపన్ను బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వ స్థాయిలో కమిషనర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ భారీ బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులను కలవటం, ఆస్తిపన్ను వసూలుకు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. మెరుగైన పౌరసేవలను పొందేందుకు నగరవాసులు ముందుగానే ఆస్తపన్ను ను చెల్లించాలని ఆయన సూచించారు.
21న ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం
నగరంలో ఆస్తిపన్న వివాదాల పరిష్కారానికై ఈ నెల 21వ తేదీ ఆదివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రాపర్టీ ట్యాక్సు పరిష్కారం పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిహెచ్‌ఎంసి కార్యాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఆస్తిపన్ను విషయంలో వ్యత్యాసాలు, పన్నుదారుల సమస్యలు, ఇతర లీగల్ అంశాలను సామరస్యంగా అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా 21వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో సహా అన్ని స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొని సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. మొత్తం 13లక్షల మంది ఆస్తిపన్ను బకాయిదారుల్లో 5లక్షల మంది బకాయిదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఆస్తిపన్ను మినహాయింపు లభించిందని, మిగిలిన 8లక్షల ఆస్తులకు సంబంధించి పన్నును వసూలు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆయన అధికారులకు సూచించారు.

కాస్త ముందే!
వేసవి రాకముందే
మండిపోతున్న ఎండలు
సాధారణం 32..అదనంగా
4 డిగ్రీలు నమోదు
మున్ముందు మరింత
ముదిరే అవకాశాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: వేసవి కాలం ఈ సారి కాస్త ముందుగానే వచ్చిందా అన్న అనుమానం కల్గుతుంది ప్రస్తుతం మండిపోతున్న ఎండలతో. ప్రతి సంవత్సరం శివరాత్రి చలి గజగజ వణికించి వెళ్లిపోయిన తర్వాత ఎండలు మండుతాయి. కానీ ఈ సారి కాస్త ముందునే ప్రచండ భానుడు ప్రతాపాన్ని చూపుతున్నారు. ఈరోజుల్లో సాధారణంగా 32 డిగ్రీలు నమోదు కావల్సిన పగటి ఉష్ణోగ్రతలు అదనంగా నాలుగైదు డిగ్రీలు అంటే 35 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పనె్నండు గంటల తర్వాత నగరంలో రద్ధీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పలుచబడిపోతున్నాయి. తెల్లవారుజాము అయిదారు గంటలసమయంలో వాతావరణం చల్లగా ఉండి చలి గాలులు వీయటం, ఆ తర్వాత పదకొండు గంటల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగటం, ఆ తర్వాత సాయంత్రం ఏడు, ఎనిమిది గంటల నుంచి చల్లటి గాలులు వీయటంతో వాతావరణంలో మార్పులు అయోమయంగా మారి, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగానే ఎండలు మండిపోతున్నాయని, మున్ముందు మరింత మండిపోయే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కాస్త ముందుగానే మండిపోతున్న ఎండలతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
జీవో111ను పునః సమీక్షించాలి
హైకోర్టులో పిల్ దాఖలు
ముషీరాబాద్, ఫిబ్రవరి 16: నగర శివారులోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల ఎగువ, దిగువ ప్రాంతాలలలోని 10 కిలోమీటర్ల మేరకు ఎలాంటి తవ్వకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదని 1996లో నాటి ప్రభుత్వం జారీ జేసిన జీవో నెం.111 ను తెలంగాణ ప్రభుత్వం పునః సమీక్షించాలని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పి.కార్తీక్‌రెడ్డి కోరారు. ఈవిషయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జీఓ వల్ల అభివృద్ధి పనులపై ఆంక్షలు ఉండటంతో పరిసర ప్రాంతాలలోని సుమారు 184 గ్రామాలలో సంక్షేమం కుంటుపడిందని అన్నారు. తమ పిల్‌ను హైకోర్టు స్వీకరించినట్టు తెలిపారు. వారం రోజుల్లో బాధిత గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో 111 జీవోను రద్దు చేస్తామని హమీనిచ్చినట్లు తెలిపారు. తమ పోరాటానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూడాకలిసివచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సియాచిన్ వీర సైనికులకు ఘన నివాళి
మేడ్చల్, ఫిబ్రవరి 16: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రమైన సియాచిన్ మంచుకొండపై ప్రమాదవశాత్తు మంచుచరియల కింద సజీవంగా సమాధి అయిన వీరజవాన్లకు మేడ్చల్ మండల బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. పట్టణంలోని జాతీయ రహదారి హౌసింగ్‌బోర్డు ప్రధాన రోడ్డు వివేకానంద విగ్రహం వద్ద వీర సైనికుల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మంచుచరియల కింద సజీవ సమాధి కాగా ఆరు రోజుల సైనికుల గాలింపు తర్వాత హనమంతప్ప అనే సైనికుడి మంచులో ఇరుక్కుపోయి సజీవంగా లభించిన తదనంతరం చికిత్స పొందుతూ అమరుడైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం పది మంది వీర సైనికులు మత్యవాత పడ్డారు. వారి ఆత్మకు శాంతి కలగాలని నాయకులు రెండు నిమిషాలు వౌనం పాటించి వీర సైనికులు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
విధి నిర్వహణలో దేశ సరిహద్దు వద్ద కాపలా కాస్తూ అమరులైన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పర్నపల్లికి చెందిన సిపాయి ముస్తాక్ అహ్మద్ కూడా అమరుడు కావడం పట్ల నాయకులు ప్రత్యేకంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరారం జగన్‌గౌడ్, నగర పంచాయతీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి నాయకులు సర్వేశ్వర్‌రెడ్డి, రాజుగౌడ్, దాత్రిక లక్ష్మన్, నర్సింగ్‌రావు, మర్రి సాయినాథ్‌రెడ్డి, మల్లేశ్, దశరథ ముదిరాజ్, సిఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు: సుధీర్‌రెడ్డి

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 16: పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో పోచారం గ్రామానికి చెందిన మెట్టు ప్రభాకర్‌రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లక్ష రూపాయల చెక్కును మంగళవారం అందజేశారు. పోచారం గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డికి గుండెనొప్పి రావటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్తచ్రికిత్స చేయించుకున్నాడు. ఆర్ధికంగా వెనుకబడి ఉండటంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చొరవ తీసుకుని నిధులు మంజూరు ఇప్పించారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ పేదప్రజలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయటంతో పాటు వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావంతో ఇక్కడి ప్రజలకు విద్య, ఉద్యోగం, వైద్యం సమృద్ధిగా అందుతున్నట్టు ఆయన తెలిపారు.
బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి సభ్యుడు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్త కార్పొరేటర్‌లకు పాత సమస్యలు

అల్వాల్, ఫిబ్రవరి 16: అల్వాల్ మున్సిపల్ పరిధిలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అన్ని ప్రాంతాలతోపాటు అల్వాల్ ప్రాంతం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పూర్తిస్థాయిలో నివాస (రెసిడెన్షియల్) ప్రాంతం 1988లో శివారులో కొత్తగా ఏర్పాటైన 12 మున్సిపాలిటీల్లో అల్వాల్ ఒకటి. మున్సిపాల్టీ ఏర్పాటు సమయంలో సగభాగం కంటోనె్మంట్ నియోజకవర్గం, మరో సగభాగం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేది. రెండుసార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి చెందిన కనకరాజు, రెండవసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వి. జీవకన్ చైర్మన్‌లుగా పనిచేశారు. మున్సిపాలిటీ గ్రేటర్‌లో విలీనం అయిన తర్వాత అల్వాల్‌లో మూడు డివిజన్‌లు ఏర్పాటయ్యాయి. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అల్వాల్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గీతారాణి గెలిచారు. మచ్చబొల్లారం డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుత కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్ గెలిచారు. ఆయన రెండవ సారి కార్పొరేటర్‌గా గెలిచారు. యాప్రాల్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రసన్నకుమారి గెలిచారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో మచ్చబోల్లారం, అల్వాల్, వెంకటాపురంతోపాటు నెరేడ్‌మెట్ డివిజన్‌లు ఉన్నాయి. ఆందరు కార్పొరేటర్‌లు అధికార పార్టీ తెరాసకు చెందిన వారే గెలిచారు. కాని అల్వాల్ పూర్తిస్థాయిలో శివారు ప్రాంతం కావటంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గతంలో సరియైన నిధులు లేకపోవటం ఒక వంతుకాగా ఇక్కడ నివసించే వారు కూడా పేద, మధ్యతరగతి వారు ఉండటంతో పెద్దగా అభివృద్ధి చెందలేదు. చాలావరకు కాలనీలలో ప్రభుత్వం రోడ్లు , నీటిసరఫరా, వీధిదీపాలు ఏర్పాటు చెయ్యాలంటే 30 శాతం నిధులు కాలనీవారు కడితే 70 శాతం నిథులు ప్రభుత్వం భరించి సంబంధిత పనులు చేపడతారు. కాని కాలనీల అభివృద్ధి పనులకు 30 శాతం నిధులు కూడా చెల్లించలేని వారు ఉన్నారు. కనుకనే కాలనీల్లో అభివృద్ధి పనులు జరగటం లేదు. అన్ని రకాల అభివృద్ధి పనులు జరగాలంటే నిధులు అవసరం కనుక నిధుల లేమి కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మచ్చబొల్లారంలోని తుర్కపల్లి, బందం బటన్‌గుడ, కౌకూర్, బర్షపేట, భరత్‌నగర్ ప్రాంతాలు ఇంకా గ్రామాల మాదిరిగానే ఉన్నాయి.
వెంకటాపురం డివిజన్‌లోని కానాజిగూడ, సుభాష్‌నగర్, ఇందిరానగర్ కూడా ఏమాత్రం అభివృద్ధి చెంద లేదు. అల్వాల్ మొత్తంగా పేద, మధ్యతరగతి వారు నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు హైదరాబాద్‌లో మొదటిసారిగా చెన్నరాయనీ చెరువులో ప్రారంభించారు. ఇంకా పూర్తిస్థాయిలో పనులు జరగాల్సి ఉంది. అంతర్గత రోడ్లు డ్రైనేజీ, నీటి సరాఫరా లైన్‌ల కోసం తవ్విన గుంతలు మూయకపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజీవ్ రహదారిలో అల్వాల్ రైతుబజార్ నుంచి జూబ్లీబస్సు స్టేషన్ వరకు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు కార్పొరేటర్‌లకు ప్రధాన సమస్యగా మారింది. అల్వాల్‌లో లోతుకుంట నుండి వెంకటాపురం, వెస్టు వెంకటాపురం వరకు ఉన్న రహదారిని , అల్వాల్ గోల్నాక చౌరస్తా నుంచి ఓల్డు అల్వాల్ ఇందిరాగాంధీ చౌరస్తావరకు ఉన్న రోడ్లను ఆధునీకరించాల్సి ఉంది. ప్రాంతాల వారీగా కొత్త కార్పొరేటర్‌లకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

సాగర్ రహదారి విస్తరణకు నిధుల మంజూరు

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 16: ఇబ్రహీంపట్నం నుండి యాచారం మండలం మాల్ వరకు రెండవ విడత సాగర్ రహదారి విస్తరణకు నిధులు మంజూరయినట్టు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఎలిమినేడు గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి విడతలో బొంగ్లూ నుండి ఇబ్రహీంపట్నం వరకు సాగర్ రహదారి విస్తరణ పనులు జరిగినట్లు వివరించారు. అయితే మాల్ వరకు సాగర్ రహదారిని విస్తరించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం నుండి మాల్ వరకు 34 కోట్ల రూపాయలు విస్తరణకు మంజూరయినట్లు తెలిపారు. ఈ నిధులను వెచ్చించి రహదారిని పదిమీటర్ల మేర విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. మరో 3-4 నెలలలోగా కృష్ణా పుష్కరాలు రానున్నందున ఇటు నుండి వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంబిస్తున్నట్లు చెప్పారు. రహదారి విస్తరణకు గానూ మొత్తంగా 64 కోట్ల రూపాయల మేర నిధులకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని, అయితే పుష్కరాలకు ప్రజలు పోవడంతో పనులకు ఆటంకం వాటిల్లుతుండని గ్రహించి 34 కోట్లతో పది మీటర్ల మేర విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ పనులను వెంటనే ప్రారంభించి ఆగస్టు నెలలోగా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంచాల రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని వేగవంతం చేసేందుకు గుత్తేదార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నగరపంచాయతీ పరిధిలోనూ రోడ్డు నిర్మాణ పనులు నాలుగు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని చెప్పారు. అవి కూడా త్వరగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులతో మాట్లాడనున్నట్లు వివరించారు. రహదారి విస్తరణ పనులకు ఆటంకం కలిగే విధంగా రహదారి పక్కగా ఉన్న విద్యుత్ స్తంబాలు తొలగించి పనులకు ఆటంకం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సమస్యను వివరించినట్లు పేర్కొన్నారు. రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేసి ప్రయాణీకుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ప్రస్తుత తెరాస ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అత్యధికమొత్తంలో నిధులను మంజూరు చేస్తోందని చెప్పారు. నారాయణఖేడ్ ఉపఎన్నికలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. తెలంగాణలో తెరాసకు తిరుగులేదని మరోసారి నిరూపితమయ్యిందని చెప్పారు. గతంలో వరంగల్ ఉపఎన్నిక, గ్రేటర్‌లో స్వతహాగా మెజార్టీ స్థానాల్లో గెలుపుతో పాటు నేడు తాజాగా నారాయణఖేడ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసిందన్నారు. నారాయణఖేడ్‌లో తెరాస అభ్యర్థి విజయానికి మంత్రి హరీష్‌రావు ఎంతో శ్రమించారని ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్ ఆకుల యాదగిరి, మల్లప్ప, ధీరేశ్వరప్ప, రాంరెడ్డి పాల్గొన్నారు.
మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్సులు
* మెట్రోకు అనుసంధానంగా ఎకో ఫ్రెండ్లీ వాహనాలు
* తొలి దశగా 791 కాలనీలకు నాలుగు రకాల సేవలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: తరుచూ ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే జంటనగరవాసులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు పనులు మరింత ఊపందుకున్నాయి. ఒకవైపు కారిడార్లు, మెట్రో స్టేషన్ల నిర్మాణ పనులను చేపడుతూనే మెట్రోరైలు రాకపోకలు వేళలకు అనుకూలంగా స్టేషన్ల నుంచి కాలనీలు, బస్తీలకు ఇకో ఫ్రెండ్లీ వాహనాలు నడిపే అంశంపై కసరత్తు చేస్తోంది. కాలనీలు, బస్తీల నుంచి మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్సులను నడపాలని యోచిస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రత్యేక అధ్యయనం నిర్వహించిన మెట్రోరైలు అధికారులు ఇందుకు 791 బస్తీలు, కాలనీలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. మూడు మెట్రోరైలు కారిడార్లలోని అన్ని స్టేషన్లకు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు మెట్రోరైలు సేవలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా వారి అవసరాలను బట్టి మెట్రో స్టేషన్లకు తీసుకువచ్చే అంశంపై కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ముఖ్యంగా నగరంలోని రోడ్ల పరిస్థితి, మలుపుల ఆధారంగా ఆటో రిక్షాలు, మినీ బస్సుల్లో ప్రయాణికులను ఎలాంటి అడ్డంకుల్లేకుండా త్వరగా స్టేషన్‌కు చేర్చేందుకు ఏది వీలైతే అది నడపాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఈ రకంగా నడిపే ఫీడర్ బస్సులను ఇకో ఫ్రెండ్ కాలుష్య రహిత వాహనాలను నడిపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు ఆటోమోబైల్ కంపెనీలు బ్యాటరీలతో నడిచే వాహనాలను తయారు చేస్తున్నందున, తొలి నుంచి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్న మెట్రోరైలు అధికారులు బ్యాటరీ వాహానాలను నడపాలని భావిస్తున్నారు. ఇందుకు సర్కారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం మెట్రో స్టేషన్ల వారీగా, ఆ స్టేషన్ కు సమీపంలోని కుడి, ఎడమ వైపున్న పరిసర ప్రాంతాలకు నడపాల్సిన ఫీడర్ బస్సుల సర్వీసులపై అధికారులు చేపట్టన అధ్యయనం సైతం ముగిసింది.
అధ్యయన సారాంశం
మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్సులను నడిపే అంశంపై అధికారులు చేపట్టిన సర్వేకు సంబంధించిన నివేదికలోని ప్రధానంశాలిలా ఉన్నాయి. సుమారు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల మార్గంలో ఈ ఫీడర్ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి అయిదు నుంచి పది నిమిషాలకో బస్సును నడపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉండే కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాలు, పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు వంటి జన సంచారమెక్కువగా ఉండే ప్రాంతాల నుంచి స్టేషన్ వరకు ఈ బస్సులను నడపాలని నిర్ణయించారు.
ప్రతి 90 సెకన్లకు ఓ రైలు
మెట్రోస్టేషన్ నుంచి ప్రతి 90 సెకన్లకు ఓ రైలును నడిపేందకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే గంటకు 45 రైళ్లు ఒక్కో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. అంతేగాక, మెట్రో అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రయాణికుల సంఖ్య పోటెత్తే అవకాశముండటంతో ఫీడర్ బస్సుల సిట్టింగ్ సామర్థ్యాన్ని 20 నుంచి 40 మధ్య ఉండాలని నిర్ణయించారు. ఒక్కో రైలు వెయ్యి మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నందున 50వేల మంది ప్రయాణికులు స్టేషన్లకు రాకపోకలు సాగించే అవకాశముండటంతో నాలుగు రకాల ఫీడర్ బస్సులు, మినీ బస్సులు, ట్యాక్సీలను అందుబాటులోకి తేవటంతో పాటు వీటిలోని సిట్టింగ్ సామర్థ్యం 40 మందికి ఉండే వాహనాలను వినియోగించనున్నారు.
నాలుగు రకాలుగా ఫీడర్ సర్వీసులు
కేవలం మెట్రోరైల్ ద్వారానే గాక, అనుబంధ ప్రాంతాల ప్రజలు ఎలాంటి అడ్డంకులు, ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణించాలన్న ప్రధాన సంకల్పంతోనే ఫీడర్ బస్సులను నడపాలని మెట్రోరైలు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మెట్రో స్టేషన్లకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు నాలుగు రకాల ఫీడర్ రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తేనున్నారు.
* కాలుష్య రహిత ఫీడర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు అంటే, ఓ భారీ అపార్ట్‌మెంట్‌కు గానీ, షాపింగ్ మాల్‌కు గానీ మెట్రో స్టేషన్ నుంచి ప్రత్యేకంగా స్కైవేలు, వాక్‌వేస్‌లు ఏర్పాటు చేసి, లేక సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సైకిళ్లను అందుబాటులో ఉంచటం
* ఇంటర్మీడియట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అనే మరో ఫీడర్ రవాణా వ్యవస్థను కూడా ఎంచుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న కాలనీలు, బస్తీల నుంచి ప్రయాణికులు స్టేషన్లకు చేరుకునేందుకు వీలుగా బ్యాటరీలతో నడిచే ఆటో రిక్షాలు, ట్యాక్సీలను అందుబాటులోకి తేవటం.
* షేర్ రైడ్ సర్వీసుల ద్వారా కూడా మధ్య తరగతి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించాలని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా మెట్రో స్టేషన్‌కు బ్యాటరీ ద్వారా నడిచే షేరింగ్ ఆటోలు, ట్యాక్సీలను నడిపాలని యోచిస్తున్నారు.
* స్టేషన్‌కు సమీపంలోని ప్రాంతాల నుంచి స్టేషన్ వరకు బ్యాటరీతో నడిచే మినీ బస్సుల ద్వారా కూడా ఫీడర్ ట్రాన్స్‌పోర్టు సేవలు అందించనున్నారు. ఇవి కనిష్ఠంగా 20 మంది గరిష్ఠంగా 40 మంది ప్రయాణికుల సామర్థ్యం కల్గి ఉంటేనే మలుపుల వద్ధ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్ణీత సమయంలో స్టేషన్‌కు చేరుకునే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు.
‘కిస్ అండ్ మూవ్’తో పార్కింగ్ ఇక్కట్లకు చెక్
కాలనీలు, బస్తీల నుంచి మెట్రో స్టేషన్లకు ప్రయాణికులను తీసుకువచ్చే నాలుగు రకాల ఫీడర్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు మెట్రో స్టేషన్ ఆవరణలో గానీ, బస్తీలు, కాలనీల్లో గానీ ఎక్కుపు ఆపకుండా ‘కిస్ అండ్ మూవ్’ విధానం ద్వారా వీటిని ఆపరేట్ చేస్తారు. కేవలం ప్రయాణికులను ఎక్కించుకుని మెట్రో స్టేషన్ ఆవరణలో ఇవి ఆగేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్ వద్దే వారిని డ్రాప్ చేసి వెళ్లిపోవటం, మళ్లీ స్టేషన్ దిగి, పాయింట్ వచ్చే వారిని ఎక్కించుకోవటం వంటి విధులు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. రాత్రి కేవలం రెండు నుంచి మూడు గంటల పాటు మెట్రోరైలు రాకపోకలు లేని సమయంలో వీటిని పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకస్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.
నో వెయిటింగ్..బీ సేఫ్!
మెట్రోరైలు ప్రయాణికులు కేవలం మెట్రోరైల్‌లోనే గాక, స్టేషన్‌లో, ఫీడర్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లోనూ సురక్షితంగా ప్రయాణించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కాలనీకి వచ్చిన ఫీడర్ వాహనం ఎక్కగానే రైలు సరైన సమయానికి స్టేషన్‌లో దింపుతోంది. దిగువ ప్రయాణంలో కూడా స్టేషన్‌లో దిగగానే, ఫీడర్ వాహనాలు రెఢీగా ఉంటాయి. అవి నేరుగా కాలనీలో,బస్తీల్లో డ్రాప్ చేయటంతో ప్రయాణికుడు ఎక్కడా కూడా వెయింటింగ్ చేయాల్సిన పని లేకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చు.
ప్రతి గ్రామానికి
మంచినీటి సరఫరా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: రంగారెడ్డి జిల్లాలో ప్రతిగ్రామానికి మంచినీటిని అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్య్లూఎస్ ఇంజనీర్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక, నీటిసరఫరా, మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. మంచినీటి సరఫరాకు నిధులకొరత లేదని, అధికారులు తీవ్ర నీటిఎద్దడి ఉన్న గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు 9.70కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. రాబోయే 4 నెలల్లో మంచినీటి కొరత ఇంకా తీవ్రరూపం దాల్చుతుందని, ఇంజనీర్లు సన్నద్ధం కావాలని సూచించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించి నీటి ఎద్దడిపై నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. సిఆర్‌ఎఫ్ కింద రూ.59.09కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని ప్రజల అవసరాల మేరకు ఖర్చు చేయాలని సూచించారు. నాన్‌సిఆర్‌ఎఫ్ కింద రూ.47.13కోట్ల నిధులు ఉన్నాయని వీటిని పైప్‌లైన్‌లు, తదితర వాటి కోసం వినియోగించుకోవాలని తెలిపారు. స్వచ్ఛ్భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షిస్తూ 11మండలాలలో 170గ్రామాలకు ప్రభుత్వం ఇప్పటికే 17,410 మరుగుదొడ్లకు మంజూరు ఇచ్చిందని, వీటిపై వెంటనే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఇంజనీర్లకు సూచించారు. ఈ సమావేశంలో సిపిఓ శర్మ, ఆర్‌డబ్ల్యు ఎస్‌ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు వెంకటరమణ, కిరణ్‌కుమార్, డిఈఈ, డిఈలు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: రంగారెడ్డి జిల్లాలో మార్చి 2 నుండి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఉదయం 9గంటల నుండి 12గంటల వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 244 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలు సజావుగా జరిగేందుకు 144సెక్షన్‌ను అమలు చేయాలని ఆమె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, మాస్ కాపీయింగ్ జరుగకుండా పటిష్ట బందోభస్తు ఏర్పాటు చేయాలని సైబరాబాద్, వికారాబాద్ పోలీసు అధికారులకు సూచించారు. పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్, మంచినీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సంవత్సరం నవాబ్‌పేట్‌లో నూతన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, సెంటర్లో అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి బందోబస్తు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్‌ఐఓలు జయప్రదబాయి, హన్మంత్‌రెడ్డి, డిఈఓ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
దిల్‌సుఖ్‌నగర్, ఫిబ్రవరి16: నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్‌లు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎల్‌బినగర్ సర్కిల్‌లో 12 డివిజన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా విజయోత్సవ సభను గడ్డిఅన్నారం డివిజన్ పుష్పాగార్డెన్‌లో నిర్వహించారు. ఈ సభకు మంత్రి మహేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను తూచాతప్పకుండా అమలు పరుస్తుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన పేదలకు అందేవిధంగా కృషి చేయాలన్నారు. అనంతరం కార్పొరేటర్లు ముద్దగోని లక్ష్మీ ప్రసన్న, జిన్నారం విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, పద్మానాయక్, సామ రమణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, విఠల్‌రెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, తిరుమల్‌రెడ్డి, అనితారెడ్డి, సంగీత ప్రశాంత్‌గౌడ్, సాగర్‌రెడ్డిలను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్‌చార్జ్ ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, నాయకులు కందికంటి ప్రేమ్‌నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో డివిజన్ల అభివృద్ధికి బాటలు
ఉప్పల్, ఫిబ్రవరి 16: హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, ఉప్పల్ డివిజన్లలో నూతనంగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లు గోపు సరస్వతి, బేతి స్వప్న, మేకల అనలారెడ్డి మంగళవారం సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ, ఇఇ నాగేందర్‌యాదవ్, విఓ కృష్ణప్రసాద్, ఏసిపి ప్రసాద్, ఎఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
డివిజన్ల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల విషయంలో అన్ని విభాగాల అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో నీటిసమస్య త