హైదరాబాద్

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: వేసవి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ భానుడి ప్రతాపం పెరుగుతుండటంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కారణంగా రాత్రి పూట కూడా వేడిగాలులు వీయటంతో ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం అర్ధరాత్రి బలమైన ఈ దురుగాలులు వీచాయ. ఉ దయం తొమ్మిది గంటల నుంచేఎండ మండిపోవటంతో ఉపశమనం కోసం ప్రజలు రకరకాల మార్గాలను అనే్వషిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పై చిలుకు నమోదు కావటంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జనం జంకుతున్నారు. గడిచిన వారం రోజుల నుంచి రికార్డు అయిన ఉష్ణోగ్రతలతో గురువారం నాటి పరిస్థితి గమనిస్తే మధ్యాహ్నం తర్వాత వాతావరణం కొంత వరకు చల్లబడింది. కానీ రానున్న రెండు,మూడు రోజుల్లో మళ్లీ ఎండలు బాగా మండే పరిస్థితులున్నాయి. తొమ్మిది గంటల నుంచే ఎండ మండిపోవటంతో వాహనాలతో నిత్యం రద్దీగా కన్పించే పలు మెయిన్‌రోడ్లపై రాకపోకలు పలుచబడుతున్నాయి. రెప్పపాటు కూడా కరెంటు సరఫరా ఆగకుండా సరఫరా చేయటంలో ప్రభుత్వం సఫలమవుతున్నా, వేసవి తాపం కారణంగా ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్లు, ఏసిలు, కూలర్లు, టీవిల వినియోగం పెరగటంతో లోడు పెరిగి పలు ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా రోజుకి రెండు,మూడుసార్లు సరఫరాలో లోపాలు తలెత్తి కాసేపు స్తంభించిపోతోంది. చిన్నపాటి మరమ్మతులే అయినా వాటిని చేపట్టేందుకు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించటంతో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయా? అంటూ ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉపశమనం కోసం ఉపాయాలెన్నో..
ఎండలు మండిపోవటంతో ఉక్కపోత, వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతలపానీయాలు, కొబ్బరి బోండాలు ,పుచ్చపండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటికి డిమాండ్ పెరగటంతో ధరలు కూడా పెరిగాయి. రద్ధీగా ఉండే మెయిన్‌రోడ్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టాళ్లవద్ధ వినియోగదారుల రద్ధీ కన్పిస్తోంది. సెలవు దినాల్లో కూడా ట్యాంక్‌బండ్, పీపుల్ల్‌ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, బిర్లా మందిర్, ఐ మాక్స్ ధియేటర్స్, ఖైరతాబాద్,అప్పర్ ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో చెరుకురసం, పండ్ల రసం విక్రయాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు చోట్ల వివిధ రాజకీయపార్టీలు, స్వచ్చంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారులకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఎండలు ఇపుడే ఈ స్థాయిలో మండిపోతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సైతం లేకపోలేదు.

ఉన్నట్టా? లేనట్టా?
ఎన్నికకే పరిమితమైన వార్డు కమిటీలు * కార్యదర్శుల నియామకం హుళక్కేనా?

హైదరాబాద్, ఏప్రిల్ 27: మహానగర పాలక సంస్థ విధానపరమైన, పరిపాలనపరమైన, అభివృద్ధి పరమైన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు నియమించిన వార్డుల కమిటీలు కేవలం నియామకానికే పరిమితమయ్యాయన్న విమర్శలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ కమిటీలు నియమించి ఏడాది గడుస్తున్నా, ఎక్కడా కూడా వార్డు కమిటీలు జరిగి, అభివృద్ధికి గానీ, పౌరసేవల నిర్వాహణను మెరుగుపరిచేందుకు ఎలాంటి తీర్మానాలు తీసుకున్న దాఖలాల్లేవు. ఫలితంగా వార్డు కమిటీలున్నాయా? లేవా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్ కార్పొరేటర్లకు కేటాయించిన బడ్జెట్‌లో ఇరవై శాతం బడ్జెట్‌ను ఈ వార్డు కమిటీలకు కేటాయించినా ఇప్పటి వరకు అభివృద్ధికి సంబంధించి ఎలాంటి తీర్మానాలు చేయలేదు. ఇందుకు అవసరమైన వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసుకుని తీర్మానాలను చేసి పంపాలని సూచిస్తూ కార్యదర్శులను నియమించి నెలలు గుడుస్తున్నా, నేటికీ ఒక్క వార్డులో కూడా చెప్పుకోదగిన స్థాయిలో వార్డు కమిటీల సమావేశం జరగలేదు. జిహెచ్‌ఎంసి చేపట్టే అభివృద్ధి పనుల్లో, పౌర సేవలు నిర్వాహణ, వౌలిక వసతుల కల్పనకు సంబంధించి తీసుకునే నిర్ణయాల మాట అలా ఉంచితే చాలా వార్డుల్లో కార్పొరేటర్ల అనుచరులే ఈ వార్డు కమిటీల్లో సభ్యులుగా కొనసాగుతున్నందున పలు అక్రమాలు కూడా జరుగుతున్నట్లు ఇటీవలే ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే! అభివృద్ధిలో డివిజన్‌లోని ప్రతి ప్రాంతం, ప్రతి వర్గానికి చెందిన వారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గాను కొందరు కార్పొరేటర్ ద్వారా ఎన్నుకున వారిని, మరికొందరు కాలనీ సంక్షేమ సంఘాలకు చెందిన వారిని, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులను వార్డు కమిటీల్లో సభ్యులుగా నియమించినా, వారి పాత్ర కేవలం విజిటింగ్ కార్డులకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇదివరకున్న జిహెచ్‌ఎంసి పాలక మండలిలో కార్పొరేటర్లకు ఏటా రూ. కోటి బడ్జెట్ కేటాయించేవారు. అందులో ఇరవై శాతం వార్డు నిధులను సద్వినియోగం చేసుకునేలా అభివృద్ధి తీర్మానాలు చేయాల్సి ఉన్నా, అప్పట్లో కూడా వార్డు కమిటీల సమావేశం, తీర్మానాలు అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. పైగా ఈ సారి పాలక మండలిలో సభ్యులుగా కొనసాగుతున్న కార్పొరేటర్లకే వార్షిక బడ్జెట్ లేదని, వార్డు కమిటీ తీర్మానాలు దేనికంటూ? మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, తమ అధ్యక్షతన ఈ వార్డు కమిటీ సమావేశాలు నిర్వహించి, ఇందులో ఇరవై శాతం నిధులను కమిటీకి కేటాయిస్తే మున్ముందు తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న భయంతోనే కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లు ఈ వార్డు కమిటీలను కేవలం ఎన్నికకు, తమ అనుచరులు విజిటింగ్ కార్డులు ప్రింట్ చేసుకునేందుకే పరిమితం చేశారన్న విమర్శలు సైతం లేకపోలేవు.