హైదరాబాద్

‘ఓయూలో సిఎం ఎందుకు మాట్లాడలేదు?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణలో ఏకైక బాహుబలి అని ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రులు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఉస్మానియా వర్సిటీలో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో ఎందుకు మాట్లాడలేదని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎవరైనా ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహి అని ముద్ర వేయడం భావ్యం కాదని శుక్రవారం ఉద్యమ వేదిక నాయకులు శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ రెడ్డి, సందీప్ చమర్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. వరంగల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ సభ ఏర్పాట్లకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. రోడ్డు నియంత్రణ వాహన నిబంధన చట్టాన్ని కాదని వెయ్యి ట్రాక్టర్లను తీసుకుని వెళ్లేందుకు ఆర్‌టిఎ ఎలా అనుమతించిందని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులను అందలమెక్కించడం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరిట వేల ఎకరాలను ధ్వంసం చేయడం జీవన విధ్వంసం కాదా? అని ప్రశ్నించారు.

రూ.కోటి విలువైన కొకైన్ పట్టివేత

హైదరాబాద్, ఏప్రిల్ 28: నిఘా వర్గాల సమాచారం మేరకు నైజీరియా జాతీయుడు లారీ ఓనెకాచి (35)ను అరెస్టు చేసి 200 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) హైదరాబాద్ జోన్ డైరక్టర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.కోటి వరకు ఉంటుందని వెల్లడించారు. గురువారం బెంగళూరు వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో నిందితుడు ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సోదా చేసి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని విచారించగా మరిన్ని విషయాలు తెలిశాయని తెలిపారు. ఢిల్లీలో కొకైన్‌ను తీసుకుని బెంగళూరులో ఉన్న తన స్నేహితుడికి అందజేసేందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇతని వద్ద ఉన్న పాస్‌పోర్టు కాపీ కూడా ఫోర్జరీ చేసిందేనని, అది కూడా కాలం చెల్లిందేనని ఎన్‌సిబి జోనల్ డైరక్టర్ వెల్లడించారు. 2012లోనే నిందితుడి వీసా కాలపరిమితి ముగిసిందని, ఆ తర్వాత తిరిగి వెనక్కి తన స్వదేశానికి వెళ్లిపోయాడని చెప్పారు. అనంతరం టూరిస్టు వీసాతో 2012లో భారత దేశానికి తిరిగి వచ్చి ఇక తిరిగి వెళ్లకుండా ఢిల్లీలోని చందర్ విహార్ ప్రాంతంలో మకాం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు.