హైదరాబాద్

సిద్ధమైన రిజర్వాయర్లలో ట్రయల్ రన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: జిహెచ్‌ఎంసిలో విలీనమైన శివార్ల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జలమండలి విశ్వప్రయత్నాలు చేస్తోంది. సుమారు రూ. 1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు కింద నిర్మించతలపెట్టిన 56 రిజర్వాయర్లలో ఇప్పటికే నాలుగింటిని అందుబాటులోకి తెచ్చిన జలమండలి మొదటి దశలో అందుబాటులోకి తేవల్సిన పనె్నండింటిలో మరో ఎనిమిదిలో నాలుగు రిజర్వాయర్లను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జలమండలి ఎండి దాన కిషోర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శివారు తాగునీటి ప్రాజెక్టుపై నిరంతరం సమీక్షలు నిర్వహించటం, పనులను తనిఖీ చేయటంతో నాలుగు రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పవచ్చు. మిగిలిన వాటిని కూడా వీలైనం త్వరగా అందుబాటులోకి తెస్తే శివార్లలోని మంచినీటి సమస్య పరిష్కారం ఓ కొలిక్కి వస్తోందని జలమండలి అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం జలమండలి కార్యాలయంలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ ఈ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనుల స్థితిగతులను ఆయన అధికారులను అడిగి తెల్సుకున్నారు. ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ పనులు, రిజర్వాయర్ల ఇన్‌లెట్, ఔట్‌లెట్ పనులు, పైప్‌లైన్ విస్తరణ పనులు, రోడ్ల మరమ్మతు పనులు, నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని సూచించారు. పైప్‌లైన్ విస్తరణ పనులు పూర్తయిన ప్రాంతల్లో హైడ్రాలిక్ టెస్టులు నిర్వహించి, ట్రయల్ రన్‌లు నిర్వహించాలని ఆదేవించారు. అర్భన్ భగీరథ పథకంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఒక్క రూపాయికే ఇచ్చే నల్లా కనెక్షన్‌పై స్వయం సహాయక బృందాల సభ్యురాళ్ల సహాయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ల పరిధుల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పైప్‌లైన్ విస్తరణ కోసం చేపడుతున్న పనుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులు జరుగుతున్నట్లు వాహనదారులకు తెలిసేలా బ్యారికేడ్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఈడి అధికారులకు సూచించారు.