హైదరాబాద్

సృజనాత్మకతతో సమర్థవంతమైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: కోటి మంది జనాభా కల్గిన మహానగర పాలక సంస్థ అధికారులు నిరంతర అధ్యయనాన్ని అలవాటు చేసుకుంటే మరింత అభివృద్ధి సాధ్యపడుతోందని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులు మరింత ఉత్తమంగా సేవలందంచేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండురోజుల వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో సక్సెస్ అన్‌లిమిటెడ్ అనే సంస్థకు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణులు, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు వెళుకువలను సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారికి ఒక్కోక్క ప్రత్యేకత కల్గి ఉంటాడని, తన విధులు, బాధ్యతలను నిర్వర్తించటంతో ఆయా ప్రత్యేకతల ద్వారా ఉత్తమ సేవలందిస్తాడని, ఇలాంటి ప్రత్యేకతలను వెలికి తీసి ప్రతి ఒక్కరికి స్పూర్తి కల్గించేందుకే ఈ రెండురోజుల వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. రెవెన్యూ,పోలీసు, సైనిక విభాగాల్లో స్పష్టలైన లైఫ్ కంట్రోల్ ఉంటుందని పేర్కొన్నారు. అధికార దర్పంతో సమస్యలకు పరిష్కారం లభించదని, సమైక్య శక్తిద్వారానే ఎంతటి కఠినమైన సమస్యనైనా పరిష్కరించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి అంటే మినీ రాష్టమ్రని, దీనిలో ఉన్న భిన్న విభాగాల మధ్య సమగ్ర అవగాహన, సమన్వయంతోనే నగరవాసలకు మెరుగైన సేవలందించటం సాధ్యమవుతోందని అన్నారు. ప్రజలను సంఘటితపరిచే విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించటం ద్వారానే ఆచార్య వినోభాభావే ఒక వ్యక్తిగా భూదాన ఉద్యమం ద్వారా 48లక్షల ఎకరాలను భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేశారని కమిషనర్ గుర్తుచేశారు. జిహెచ్‌ఎంసి లాంటి పెద్ద స్థానిక సంస్థలో నిరంతర సమాచార మార్పిడి, మోడివేషన్, పర్సువేషన్ వంటివి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సీక్రెట్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ప్రొఫెషనల్ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించిన ప్రముఖ నిపుణులు శేఖర్ అగర్వాల్ పలు ఉదాహరణలతో అత్యంత ఆసక్తికరంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా కనకంతో పాటు మలినాలు కూడా ఉంటాయని, వాటిని వేర్వేరు చేసి మేథస్సును పూర్తి స్థాయిలో ఉపయోగించటమే తెలివైన వారి ప్రతిభకు నిదర్శనమని వివరించారు. నింతరం అధ్యయనం, సమాచార మార్పిడి ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. నిరంతర విధి నార్విహణలో వినూత్న ఆలోచనలతో సమర్థవంతమైన సేవలు అందించటంలో కాస్త సృజనాత్మకంగా పనిచేయాలని శేఖర్ సూచించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఏ విధంగా తాము విజయం సాధించారనే విషయాలను ఆయన ఉదాహరణలతో వివరించారు. అనంతరం అధికారులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. శనివారం కూడా కొనసాగే ఈ వర్క్‌షాప్‌కు జిహెచ్‌ఎంసికి చెందిన దాదాపు 200మంది అధికారులు హజరుకానున్నారు.

కూల్..కూల్
చల్లబడ్డ వాతావరణం
ఉక్కపోత నుంచి స్వల్ప ఉపశమనం
శివార్లలో ఓ మోస్తరు వర్షం

హైదరాబాద్, ఏప్రిల్ 28: మండే ఎండల్లో మహానగర వాసులను శుక్రవారం సాయంత్రం చల్లటి గాలులు, చిరుజల్లులు పలకరించాయి. ఉదయం తొమ్మిది గంటలకు గరిష్ఠంగా 32 డిగ్రీలతో ప్రారంభమైన ఉష్ణోగ్రత పట్టపగలు 39 డిగ్రీలకు పెరిగింది. అప్పటి వరకు వేడిగాలులు, ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావటం, వడగాలులు వీస్తున్నందున ఉదయం పది నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావల్సి వస్తే, ఎండ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు జారీ చేయటంతో బెంబేలెత్తిన నగరవాసుల ఆందోళన శుక్రవారం సాయంత్రం నాటి చిరుజల్లులతో కాస్త తగ్గిందని చెప్పవచ్చు. సాయంత్రం అయిదున్నర గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై అక్కడా చిరుజల్లులు కురిశాయి. శివార్లలోని ఉప్పల్, రామంతాపూర్, కూకట్‌పల్లి, పార్శిగుట్ట, చిలకలగూడ, పద్మారావునగర్, బేగంపేట, బాలానగర్, మోండామార్కెట్, బోయిన్‌పల్లి, ప్యాట్నీ, మారేడ్‌పల్లి, అడ్డగుట్ట ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవటంతో ఆహ్లాద వాతావరణం నెలకొంది. నగరంలోని బషీర్‌బాగ్, లక్డీకాపూల్, లోయర్ ట్యాంక్‌బండ్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చల్లటి చినుకులు పడ్డాయి. అంతేగాక, ఒక్కసారిగా చల్లటి గాలులు వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారంది. గడిచిన వారం, పదిరోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందారు.