హైదరాబాద్

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తిని ఓటర్ల జాబితాలో చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహశీల్దార్‌లు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఓటర్ల లిస్ట్‌లో మార్పులు, చేర్పుల ప్రక్రియపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం.. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 1-1-2017 ప్రాతిపదికగా తీసుకుని సవరణ చేయుటకు షెడ్యూల్ కార్యక్రమాన్ని ప్రకటించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ 27-4-2017న, డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ రోల్స్ 01-05-2017న, 01-05-2017 నుండి 22-05-2017 వరకు క్లైయిమ్స్, అభ్యంతరాలు, 7-05-2017న రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో అభ్యంతరాల స్వీకరణకు స్పెషల్ క్యాంపైన్, 31-05-2017లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించడం, 9-6-2017న తుది జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా నుండి చనిపోయిన, స్థాన మార్పిడి చెందిన ఓటర్ల వివరాలు తొలగిస్తామని, నమోదు కాబడిన ఓటర్ల వివరాలలో తప్పుగా ఉన్న యెడల వాటిని సరిచేయడం, 01-01-2017 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన యువతీ యువకుల పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేస్తామని అన్నారు. కొత్త కాలనీలు, తండాలు ఏర్పడినందున అక్కడ నివసించే జనాబాకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను పెంచడం, ఓటర్లకు వీలుగా వారు నివసించే ప్రాంతాలకు దగ్గరలోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, పాత భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను సమీపంలోని ఇతర పాఠశాల భవనాల్లో గాని మరి ఏ ఇతర భవనాలకు మార్చడం వంటి కార్యక్రమాలకు కావాల్సిన ప్రతిపాదనలు ఇఆర్‌ఓలు సమర్పించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమగ్ర ఓటర్ల జాబితా కార్యక్రమంలో బిఎల్‌ఓలు డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిసి ప్రతి ఇంటిని విధిగా సందర్శించి ఆ ఇంటిలోని 18 సంవత్సరాల పైబడిన వ్యక్తుల వివరాలన్నీ ట్యాబ్‌లలో పొందుపరుస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు విధిగా జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒకరు చొప్పున బూత్ లెవల్ ఏజెంట్లను నియామకం చేసి ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, సమగ్ర ఓటర్ల జాబితా తయారీ కార్యక్రమాలలో పాల్గొని తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఎలక్ట్రరోల్ అబ్జర్వర్ విష్ణు, శాసనసభ్యుడు కాలే యాదయ్య, రాజకీయ పార్టీ ప్రతినిధులు కిరణ్‌కుమార్, నర్సింగ్‌రావు, పర్వతాలు, యాదయ్య, ఎలక్షన్ సెక్షన్ పర్యవేక్షకుడు మురళీకృష్ణ పాల్గొన్నారు.
నగర శివారులో చడ్డీ, బనియన్ గ్యాంగ్ దడ
తాళాలు వేసివున్న ఇళ్లే టార్గెట్ * వారం రోజుల్లో 15 దొంగతనాలు * ప్రత్యేక గస్తీ..అప్రమత్తంగా ఉండండి: కమిషనర్
హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్ నగర శివారులో చడ్డీ, బనియన్ గ్యాంగ్ దడ పుట్టిస్తోంది. తాళాలు వేసివున్న ఇళ్ళను టార్గెట్ చేసుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతోంది. వారం రోజుల్లో 15 చోట్ల దొంగతనాలకు పాల్పడిన ముఠా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మహరాష్ట్ర, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన చడ్డీ,బనియన్ గ్యాంగ్ నగరశివారు ప్రాంతవాసులను హడలెత్తిస్తోంది. ఇటీవల తట్లూబాజీ ముఠాను పట్టుకున్న సైబర్ క్రైం పోలీసులు చడ్డీబనియన్ గ్యాంగ్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వ్యాపారులను తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడుతుండగా, చడ్డిబనియన్ గ్యాంగ్ మాత్రం తాళం వేసివున్న ఇళ్లను టార్గెట్ చేస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బినగర్ సర్కిల్‌లో నాలుగు చోట్ల ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. ఒకే రోజు ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన దుండగులు రూ. 1.86 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
ముఖానికి నల్లటి ముసుగు ధరించి, చడ్డీ,బనియన్‌పై ఉండే ఈ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ సూచించారు. ఎల్‌బినగర్, మీర్‌పేట్, పేట్‌బషీరాబాద్, చౌటుప్పల్, హయత్‌నగర్, ఇబ్రహీం పట్నం, భూదాన్‌పోచంపల్లి పరిసరాల్లో ఈ గ్యాంగ్ మకాం వేసినట్టు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా ఉక్కపోతతో ఇంటికి తాళం వేసి ఆరుబయట నిద్రించే వారు అప్రమత్తంగా ఉండాలని, బయట నిద్రించే వారిపై మత్తు మందు ప్రయోగించి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోందని నగర కమిషనర్ తెలిపారు. వారం రోజుల్లో అనేక ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన చడ్డీబనియన్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపామని, త్వరలో ఈ గ్యాంగ్‌ను పట్టుకుంటామని కమిషనర్ మహేష్ ఎం భగవత్ తెలిపారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు చడ్డీబనియన్ గ్యాంగ్‌పై సమాచారం అందించామని, రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీతోపాటు పెట్రోలింగ్ ముమ్మరం చేశామన్నారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించి ఊహా చిత్రాలను విడుదల చేస్తామని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిపి కోరారు. ఊరికెళ్లేవారు ఇళ్లకు తాళాలు వేసుకుని పోలీసులకు సమాచారం ఇస్తే మంచిదని సూచించారు.