హైదరాబాద్

పనితీరు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: జిహెచ్‌ఎంసిలో కీలకమైన హోదాల్లో విధులు నిర్వర్తించే అధికారులు పనితీరులో మార్పు తెచ్చుకుని, మెరుగైన సేవలందించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. అధికారుల మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు రెండురోజుల పాటు జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిసంస్థలో నిర్వహించిన వర్క్‌షాప్ శనివారం ముగిసింది. ఈ ముగింపును పురస్కరించుకుని కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇంజనీర్లు, విభాగాధిపతులకు నిర్వహించిన ఇలాంటి వర్క్‌షాప్‌ను త్వరలోనే జూనియర్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి నిర్వహించనున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో అధికారులు బాధ్యతను పెంపొందించుకోవాలన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అధికారులు చేసే పనిలో సృజనాత్మకతను ఎలా పెంపొందించుకొవాలి, పనిభారం ఎక్కువైనపుడు ఒత్తిడి తగ్గించుకునేందుకు ఎలా రిలాక్స్ కావాలన్న ముఖ్యమైన అంశాలపై నిపుణులతో మెళుకువలు నేర్పించినట్లు ఆయన తెలిపారు. అధికారులు వాటిని తమకు అవసరమైనపుడుల్లా ఉపయోగించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేగాక, అధికారులకు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో, బాధ్యతాయుతంగా, జవాబు దారిగా పరిష్కరించేందుకు వీలుగా వారిలో ఆత్మస్థైర్యాన్ని, పని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ వర్క్‌షాప్ ఎంతో దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన హోదాల్లో పనిచేసే అధికారులకు, ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కొన్ని సందర్భాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్దంగా ఉండాలన్నారు. తాము పనిచేస్తున్న సంస్థకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేలా ప్రజలు, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలను ఏర్పర్చుకుని, ఇతర విభాగాలతో కూడా సమన్వయాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో జిహెచ్‌ఎంసికి చెందిన మొత్తం 200 మంది అధికారులు వ్యక్తిత్వ వికాసంలో పేరుగాంచిన నిపుణుడు శేఖర్ అగర్వాల్‌తో ఇంటరాక్ట్ అయి అనేక అంశాలను తెలుసుకున్నారని వివరించారు.