హైదరాబాద్

జిహెచ్‌ఎంసిలో సహపంక్తి భోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: చిన్నతరహ మొదలుకుని భారీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల పండుగ ‘మే’ డే గ్రేటర్‌లో ఘనంగా జరిగింది.
పలు ట్రేడ్ యూనియన్లు, మరికొన్ని చోట్ల ఆటో,ట్రాలీ డ్రైవర్ల యూనియన్లు మే డే ను ఘనంగా నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలను చేపట్టాయి. ముఖ్యంగా కోటి మంది జనాభా కలిగిన నగరంలో ప్రతిరోజు దాదాపు 40లక్షల వాహనాలు రాకపోకలు సాగించే 9వేల కిలోమీటర్ల రోడ్డును ఉదయం మనం నిద్రలేవగానే పరిశుభ్ర పరిచే స్వీపింగ్ కార్మికులతో కలిపి జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మే డే ఉత్సవాలు నిర్వహించారు. ఇంతకు ముందున్న కమిషనర్ సోమేశ్ కుమార్ సైతం పరిపాలనలో క్లాస్‌గా వ్యవహారిస్తూ, కార్మికులను కలిసి మాస్‌గా గడుపుతూ, వారితో అల్పాహారం, భోజనాలు చేసేవారు. సోమవారం మే డే సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి పారిశుద్ద్య కార్మికులకు సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ భోజనాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అదనపు, జోనల్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు. గతంలో జరిగిన మే డే ఉత్సవాల కన్నా ఈ మే డే సందర్భంగా ఈ రకంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయటం అధికారులు, కార్మికులు సమానమేనన్న భావన కల్గించేందుకేనని కమిషనర్ వ్యాఖ్యానించారు. అంతేగాక, తెల్లవారుఝము నుంచి కార్మికులు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే తీరును పరిశీలించిన కమిషనర్ వివిధ కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉత్తమ పారిశుద్ద్య కార్మికులను గుర్తించి, వారిని ఘనంగా సత్కరించారు. అంతేగాక కార్మికులతో ఎంతో ఫ్రెండ్లీగా గడిపిన కమిషనర్ ఈ సందర్భంగా వారి చేతికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లను కట్టారు.

జలమండలిలో పనిచేయటం అదృష్టం

ఈ భాగ్యం అందరికీ రాదు
జలమండలి
ఎండి దాన కిషోర్ వెల్లడి

హైదరాబాద్, మే 1: మహానగరంలోని సుమారు కోటి మందికి తాగునీటిని సరఫరా చేసే జలమండలిలో పనిచేయటం అదృష్టమని, ఈ రకమైన సేవ చేసే భాగ్యం అందరికి రాదని జలమండలి ఎండి దాన కిషోర్ వ్యాఖ్యానించారు. సోమవారం వాటర్ బోర్డులో ఆపరేషన్స్ డైరెక్టర్ జి. రామేశ్వరరావు, సిజిఎం వేంకటేశ్వరరావులతో పాటు పదవీ విరమణలు పొందిన మరో 12 మంది అధికారులు, ఉద్యోగులను ఆయన ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ బోర్డులో ఇంతకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను అభినందించారు. వాటర్‌బోర్డు ఉద్యోగులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆపరేషన్స్, డైరెక్టర్ రామేశ్వరరావు ఏ సమస్య ఉన్నా, సత్వరమే స్పందించే వ్యక్తి అని పేర్కొన్నారు.
అలాగే ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన రామేశ్వర్‌రావు మాట్లాడుతూ ఇంతకాలం తనకు ఉద్యోగంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నగరవాసుల దాహార్తిని తీర్చుతున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో తాము విధులు నిర్వర్తించటం దేవుడు తనకిచ్చిన వరం అని వ్యాఖ్యానించారు. కానీ ఇంతకాలం తనతో పాటు కలిసి పనిచేసిన ఇతర అధికారులు, బోర్డు ఉద్యోగులను వదిలి వెళ్లటం తనకెంతో బాధ కలిగిస్తోందని, ఆయన భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, టక్నికల్ డైరెక్టర్ డా.పి.ఎస్. సూర్యనారాయణ, పి అండ్ ఏ డైరెక్టర్ అజ్మీరాకృష్ణ, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, సిజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.