హైదరాబాద్

టౌన్‌ప్లానింగ్ ఖాళీల భర్తీకి సర్కారు ఆమోదం కమిషనర్‌కు సిఎం ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: ఎట్టకేలకు మోక్షం కల్గింది. మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను తర్వాత అధిక మొత్తంలో రాబడి వచ్చే టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గడిచిన పది నుంచి పదిహేనేళ్ల నుంచి ప్రభుత్వ పరిశీలనలో పెండింగ్‌లో ఉన్న టౌన్‌ప్లానింగ్ ఖాళీలను భర్తీ చేస్తే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల జారీని వేగవంతం చేయటంతో పాటు ఇష్టారాజ్యంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై కూడా మరింత త్వరగా చర్యలు తీసుకునేందుకు వీలుగా కల్గుతోంది. అయితే టౌన్‌ప్లానింగ్ విభాగంలో చీఫ్ సిటీ ప్లానర్ నుంచి సర్వేయర్ వరకు సుమారు 412 మంది అధికారులు, సిబ్బంది అవసరం కాగా, ఇందులో కేవలం 135 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపై పనిభారం ఎక్కువ పడటంతో పాటు ఒక్కో అసిస్టెంటు సిటీ ప్లానర్(ఏసిపి) రెండు సర్కిళ్ల వ్యవహారాలను సైతం చూడాల్సిన పరిస్థితులున్నాయంటే పని భారం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చు.
ఒక అధికారి మూడు, నాలుగు రకాల విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కారణంగా రోడ్డువిస్తరణ పనులతో పాటు అక్రమ నిర్మాణాల తొలగింపుతో పాటు భవన నిర్మాణ అనుమతుల జారీ కూడా ఆలస్యమవుతున్నాయి.
నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే జిహెచ్‌ఎంసి పట్టణ ప్రణాళిక విభాగంలో సెక్షన్ అధికారులు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కమిషనర్ జనార్దన్ రెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది. భవన నిర్మాణ అనుమతులు, అనధికార నిర్మాణల తొలగింపు, రోడ్డు విస్తరణ కార్యక్రమాలను చేపట్టడానికి విడివిడిగా అధికారుల అవసరం ఉంది.
ముఖ్యమంత్రి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ మేరకు అవసరానికి తగిన విధంగా సిబ్బందిని నియమించుకునే జిహెచ్‌ఎంసి పట్టణ ప్రణాళిక సంబంధిత విధులు మరింత ముమ్మరమయ్యే అవకాశాలున్నాయి.