హైదరాబాద్

వర్ష బీభత్సం నుంచి కోలుకోని నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఎండాకాలం..ఎండలతో జనం బేజారవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి ఉన్నట్టుండి కురిసిన వడగళ్ల వాన సృష్టించిన భీభత్సం నుంచి నగరం ఇంకా కొలుకోలేదు. జిహెచ్‌ఎంసి పరిధిలోని సెంట్రల్, వెస్ట్‌జోన్‌లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాత్రి పదకొండు గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట వరకు వివిధ ప్రాంతాల్లో సుమారు 10 సెం.మీ.ల వర్షం కురిసినట్లు, దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం, బలంగా వీచిన ఈదురు గాలుల కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి అధికారులిచ్చిన సమాచారం ప్రకారం 291 చెట్లు, మరో 32 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా మంగళవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిల్చిపోయింది. బుధవారం రాత్రి వరకు కూడా సరఫరాను పునరుద్దరించలేకపోయారు. ముఖ్యంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ కావటం, విద్యుత్ సరఫరా చేసే మెయిన్‌లైన్లున్న ప్రధాన స్తంభాలు నెలకొరగటం వల్లే ఒక్కసారిగా నగరం అంధకారమైంది. కరెంటు సరఫరాను పునరుద్దరించే పనులను విద్యుత్ శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచే చేపట్టినా, పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వరకు కూడా పునరుద్దరించలేకపోవటంతో జనం అవస్థలు పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో లోటుపాట్లు ఏర్పడటం వంటి సమస్యల కారణంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తట్టుకోలేక పలు విద్యుత్ డివిజన్లలో అధికారులు ఫోన్లను బంద్ చేసుకున్నారు. కొన్ని చోట్ల బలమైన గాలులకు చెట్లు విరిగిపడటంతో వాటి కింద పార్కింగ్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. మాసాబ్‌ట్యాంక్ సంక్షేమ భవనం ముందు రోడ్డుకిరుపులా పార్కింగ్ చేసిన పదుల సంఖ్య వాహనాలు ఈ రకంగానే దెబ్బతిన్నాయి. చాలా చోట్ల గల్మోహర్ చెట్లతో పాటు ధృడంగా ఉండే రావిచెట్లు కూడా కులాయంటే గాలుల వేగాన్ని అంచనా వేసుకోవచ్చు. నిత్యం రద్దీగా ఉండే పలు కూడళ్లలో ఉదయం పదకొండు గంటల వరకు వర్షపు నీరు నిల్చిపోవటంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులేర్పడ్డాయి. ఎండలు మండిపోతున్న సమయంలో మహానగరంలో ఇదివరకెన్నడూ లేని విధంగా బలమైన ఈదురుగాలులు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎప్పటికపుడు పరిస్థితులను పర్యవేక్షించారు.