హైదరాబాద్

కాస్త ముందుగానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే! అంతేగాక, గడిచిన వారం రోజుల నుంచి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవటం, అక్కడక్కడ చిరుజల్లులు కురవటం వంటివి సంభవిస్తున్నాయి. అయితే ఈ సారి ఎండాకాలం నెలరోజుల ముందుగానే వచ్చినట్లు చెబుతున్న పర్యావరణ వేత్తలు, వర్షాకాలం కూడా కాస్త ముందుగానే వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి నగరంలో బలమైన ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షంతో వానకాలం మొదలైందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం కూడా ఇదే మాసం రెండో వారంలో వడగళ్ల వాన కురిసింది. అప్పట్లో కూడా సుమారు 300 చెట్లు నెలకొరిగాయి. ఆ తర్వాత కూడా భారీ వర్షాలు కురవటంతో శివార్లలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. పొరుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. వాస్తవానికి కూడా జూన్ మాసం పదవ తేదీ దాటిన తర్వాత నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ఎపుడైనా వర్షాలు కురిసే అవకాశాలుంటాయి. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇపుడెలాంటి రుతుపవనాలు, తూఫాన్లు గానీ, అల్పపీడన ద్రోణులు గానీ లేకపోయినా నగరంలో పది సెంటీమీటర్ల వర్షం కురవటం అరుదైన ఘటనే. అయితే పాతకాలం లెక్కల ప్రకారం జూన్ రెండో వారం నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుందని భావించిన జిహెచ్‌ఎంసి, జలమండలి ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఎండాకాలంలో కూడా ఎపుడైనా భారీ వర్షం కురిసే అవకాశముందన్న విషయాన్ని గ్రహించి అత్యవసర బృందాలను సిద్దం చేశారు.
రానున్న రెండురోజుల్లో వర్షాలు
వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా రానున్న మరో రెండురోజుల్లో నగరంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. మంగళవారం భారీ వర్షం కురిసినందున వివిధ ప్రభుత్వ శాఖలు అప్రమత్తమై నిర్వహించిన సమావేశంలో హజరైన ఆయన మాట్లాడారు.