హైదరాబాద్

మాతృమూర్తులకు ‘మాతృదేవోభవ’ పురస్కారాలు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మే 14: అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు ‘మాతృదేవోభవ’ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ మాజీ డిసిపి సుంకర సత్యనారాయణ పాల్గొని మాతృమూర్తులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రపంచంలో మాతృమూర్తికి మించిన దైవం లేదని పేర్కొన్నారు. మహిళలకు తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. సభకు ముందు బాల సచ్చిదానందం చిన్నారులు ప్రదర్శించిన పలు సంగీత, సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. సంఘసేవకురాలు హైమవతి భీమన్న సభాధ్యక్షత వహించగా గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, వైజ్‌మెన్ సంస్థ పూర్వ క్షేత్రధికారి వైఎస్‌ఆర్ మూర్తి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సురేందర్, పుష్పలత, దయాకర్‌రాజు పాల్గొన్నారు.
వార్తలు వాస్తవాలను తెలియజేయాలి
కాచిగూడ, మే 14: సమాజంలో జరుగుతున్న పరిణామాలను టివి ఛానల్స్ వాస్తవాలను తెలియజేయాలని తెలంగాణ టెలికాం సర్కిల్ బిఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంతరామ్ అన్నారు. లలిత కళాస్రవంతి ఆధ్వర్యంలో టివి యాంకర్స్, టివి రిపోర్టర్స్‌కు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనంతరామ్ యాంకర్స్, రిపోర్టర్స్‌కు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న విశేషాలను ప్రజలకు తెలియజేసే ప్రసర కార్యక్రమాల్లో జర్నలిస్టులు, యాంకర్ల కీలక పాత్ర పోషిస్తారని కీర్తించారు. సమాజంలో ప్రతి సమస్యలపై పోరాడే జర్నలిస్టులకు పురస్కారాలను ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సభకు ముందు వి.లక్ష్మీ శిష్య బృందం అలపించిన అన్నమయ్య సంకీర్తనలు, ఎస్.రమాదేవి శిష్య బృందంచే భరతనాట్యం నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వివిధ రంగల ప్రముఖులు జిఎస్‌ఎస్.శ్రీనివాస్, మహేష్, పి.లక్ష్మారెడ్డి, రాంమ్మోహన్, గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, బద్రీప్రసాద్, సంస్థ అధ్యక్షుడు గొర్తి అన్నప దీక్షితులు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి స్వర్ణలత పాల్గొన్నారు.