హైదరాబాద్

ధర్నాచౌక్ రక్షణకు కదలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, మే 14: ప్రజా గొంతుక అయిన ధర్నాచౌక్‌ను రక్షించుకునేందుకు కదలిరావాలని సిపిఎం భోలక్‌పూర్ డివిజన్ కన్వీనర్ సయ్యద్ జాకీర్ పిలుపునిచ్చారు. ఆదివారం డివిజన్ కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను నిలదీసే హక్కు ప్రజలకు ఉందని, ప్రజలు నిలదీయని నాడు ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయవని అభిప్రాయపడ్డారు. ధర్నాచౌక్‌ను తొలగిస్తే సమస్యలు ఉండవని ప్రభుత్వం భావించటం అవివేకమని, నిరసనలు, ధర్నాలు చేయకపోతే అసలు తెలంగాణ వచ్చేదా అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరంకుశంగా వ్యవహరించటం సరికాదని హితవు పలికారు. ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు వేదికగా ఉన్న ధర్నా చౌక్‌ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మే 15న ధర్నాచౌక్ పరిరక్షణకు ప్రజాతంత్ర వాదులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం సీనియర్ నాయకులు కృష్ణస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిటియు నగర నాయకులు ఆర్.ఈ. బాబు, డివిజన్ అధ్యక్షుడు ఐలయ్య, భవన నిర్మాణ సంఘం నగర నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, ప్రజా నాట్యమండలి వీరాచారి, ఆవాజ్ ఖాజాగరీబ్, గౌస్, షరీఫ్, సోషల్ మీడియా కన్వీనర్ మల్లేష్ పాల్గొన్నారు.
దిల్‌సుఖ్‌నగర్: ప్రజాసమస్యల గొంతుకైన ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం సమంజసం కాదని ఎల్‌బినగర్ నియోజకవర్గం బిజెవైఎం కోకన్వీనర్ గన్‌గమ్ నవీన్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విదానాలకు పాల్పడుతుందని ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఎన్నో ఉద్యమాల ద్వారా బలిదానాలతో సాధించామని చెప్పే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు.. ధర్నాచౌక్ ఉద్యమాలకు వేదికగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గాలిలో మేడలు మాదిరిగా అదిగో అభివృద్ధి ఇదిగో అని మాటలకే పరిమితం అయ్యింది తప్ప ఎక్కడా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ఎంతో మంది పేద, నిరుపేద కుటుంబాలు.. ప్రభుత్వ సహాయం, ప్రోత్సహం గురించి ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని ఓట్లను దండుకొని గద్దెనెక్కిన ప్రభుత్వం.. ఆ బాధ్యతను విస్మరించిందని ఎద్దెవా చేశారు. ప్రజా అవసరాలను ప్రక్కన పెట్టి ధర్నాచౌక్ ఎత్తివేయడంపై దృష్టి సారించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష వైఖరిని ఎండగట్టడానికి వేదికైన ధర్నాచౌక్ దగ్గరనే నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అక్కడే పలుమార్లు ధర్నాలు చేపట్టారని గుర్తుచేశారు.