హైదరాబాద్

‘మెట్రో’తో మూడంచెల రవాణా ట్రాఫిక్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: మహానగరంలో బండి తీసుకుని బయటకు రావాలంటేనే భయం. రోడ్డుపై మనం సక్రమంగా ప్రయాణించినా, మన ముందు, వెనక ప్రయాణించే వాహనం కూడా జాగ్రత్తగా ప్రయాణించకపోతే అంతే సంగతులు. నిత్యం ఇలాంటి ట్రాఫిక్ టెన్షన్‌తో గడిపే మహానగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రోరైలు పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాల రద్దీ, సంఖ్యకు అనుకూలంగా ఎలాంటి ఆటంకాల్లేకుండా ప్రయాణించేందుకు ఫ్లై ఓవర్లు వంటివి నిర్మించారు. ఇపుడు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన రవాణా వ్యవస్థ మెట్రోరైలును కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కానీ ఇప్పటికే ఫ్లై ఓవర్లు నిర్మితమైన ప్రాంతాల్లో మెట్రో కారిడార్‌ను మరింత ఎత్తులో నిర్మించిన సంగతి తెలిసిందే! పంజాగుట్ట, హబ్సిగూడ, మలక్‌పేట వంటి ప్రాంతాల్లో కింద రోడ్డుపై, ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలు కొనసాగిస్తుండగా, ఈ రెండింటిపై మూడో అంచెగా నిర్మించిన మెట్రో కారిడార్‌లో రైలు పరుగులు పెట్టే అరుదైన దృశ్యం త్వరలోనే ఆవిష్కృతం కానుంది. అంతర్జాతీయ స్థాయిలోనే అరుదైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఇలాంటి కూడళ్లలో మెట్రో స్టేషషన్లు, కారిడార్లను నిర్మిస్తున్నారు.
సికిందరాబాద్ ఓలిఫెంటా బిడ్జి వద్ద కూడా అరుదైన ఆధునిక రవాణా వ్యవస్థ రూపుం దర్శనమివ్వనుంది. బ్రిడ్జి కింద నుంచి జనం, వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, బ్రిడ్జిపై రైలు, ఆ పైన నిర్మించిన మెట్రో కారిడార్‌లో మెట్రోరైలు ప్రయాణం కొనసాగించనుంది.
అంతేగాక, ఇక్కడే స్టీల్‌తో నిర్మిస్తున్న ఓ వంతెన అదనపు ఆకర్షణగా మారింది. అటువైపు హబ్సిగూడ నుంచి సికిందరాబాద్ మీదుగా బేగంపేట వైపు వచ్చే మెట్రోరైలుకు, అలాగే చిక్కడపల్లి, ముషీరాబాద్‌ల మీదుగా సికిందరాబాద్ వైపు వచ్చే మెట్రోరైళ్లకు ఈ స్టేషన్ ఇంటర్ ఛేంజీ స్టేషన్‌గా రూపుదిద్దుకుంటుంది. అలాగే అమీర్‌పేట మైత్రి వనం కూడలిలో నిర్మిస్తున్న స్టేషన్ కూడా దాదాపు అదే తరహాలో నిర్మిస్తున్నారు. అటు యూసుఫ్‌గూడ నుంచి వచ్చే మెట్రోరైలు, అలాగే మియాపూర్, ఎస్‌ఆర్ నగర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే మెట్రోరైళ్లకు ఇది కూడా ఇంటర్ ఛేంజ్ స్టేషన్ కానుంది.
‘అనుసంధానం’తో అన్ని సమస్యలకు చెక్
పంజాగుట్ట, అమీర్‌పేట, హబ్సిగూడ, మలక్‌పేట వంటి ఇలాంటి ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్లలో కింద నుంచి మెట్రో స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో ముందుచూపుతో పకడ్బందీ చర్యలు చేపట్టారు.
పాదచారులు కింద బస్ దిగగానే లిఫ్టు ద్వారా పైకి వచ్చిన మరు క్షణమే వారికి మెట్రోరైలు అందుబాటులో ఉండేలా ఆర్టీసి బస్సులు, మెట్రోరైలు రాకపోకలు అనుసంధానం చేస్తున్నారు. ప్రయాణికులు కాసేపు స్టేషన్‌లో అహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసేలా స్టేషన్లను డిజైనింగ్ చేశారు.