హైదరాబాద్

8 నుంచి చేప ప్రసాదం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 18: ప్రతి సంవత్సరం మృగశిరకార్తెను పురస్కరించుకుని అస్తమా రోగులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని వచ్చే నెల 8వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు బత్తిని మృగశిరకార్తె ట్రస్టు వ్యవస్థాపకులు బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే గాక, దేశంలోని పలు ప్రాంతాల నుంచి చేప ప్రసాదానికై వస్తుంటారని వివరించారు. గత సంవత్సరం సుమారు 4లక్షల పై చిలుకు మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ సారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ప్రసాదం తీసుకునే వారి సంఖ్య గత సంవత్సరం కన్నా ఎక్కువయ్యే అవకాశముందన్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రసాదాన్ని చేపలో అలాగే అలాగే శాఖాహారులకు బెల్లంలో పెట్టి రెండు విధాలుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రసాదం తీసుకునే రెండు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోరాదని సూచించారు. ప్రసాదం తీసుకున్న తర్వాత 45 రోజుల పాటి పత్యం పాటించాల్సి ఉంటుందని వివరించారు. ప్రసాదంతో పాకు కార్తి ప్రసాదం అందిస్తామని, అది ఆరు మాత్రలుగా వేసుకుని, జూన్ 23వ తేదీన ఉదయం పరగడుపున, తిరిగి రాత్రికి, అలాగే జూలై 8, తిరిగి 25న మూడు సార్లు వేసుకోవాలన్నారు. ఇలా నాలుగు సంవత్సరాల పాటు చేప ప్రసాదం తీసుకుంటే శ్వాస సంబంధిత వ్యాధులు దూరమవుతాయని పేర్కొన్నారు. బస్సులు, రైళ్లు దొరక్క ఆ రోజుల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకోలేని వారి కోసం నగరంలోని దూద్‌బౌలీ, కవాడిగూడ, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లిలోని బత్తిన వంశస్థుల నివాసాల వద్ద ఈ ప్రసాదం అందిస్తామని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పూర్తిగా సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బత్తిని శివప్రసాదన్, శేఖర్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
బాలాపూర్, మే 18: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన ఇరువురిని మీర్‌పేట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మీర్‌పేట్ వెంకటేశ్వర కాలనీకి చెందిన మనోజ్‌కుమార్(23), విజయ్‌కుమార్(23) ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటి పోలీసులు ఉదయం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18 వేల రెండు వందలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు.