హైదరాబాద్

రెండు రోజులు నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట: జంటనగరాల ప్రజల దాహర్తిని తీరుస్తున్న కృష్ణా ఫేజ్-1 నీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్ట్‌లో తలెత్తిన మరమ్మతుల పనులతో మార్చి 1, 2 తేదీల్లో 30 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. మార్చి 1వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 12గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేసి కృష్ణా ఫేజ్-3లో తలెత్తిన మరమ్మతులను చేపడుతున్నట్లు జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు తెలిపారు.
ఫలితంగా మార్చి 1, 2 తేదీల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు నీటిని ముందుగానే స్టోరేజీ చేసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.
* రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండని ప్రాంతాలు: అజంపుర, సుల్తాన్‌షాహి, మోగల్‌పుర, దారుల్‌షిఫా, ఫలక్‌నూమ, బహదూర్‌పుర, జహానూమ, చార్మినార్, పత్తర్‌గట్టి, మిష్రిగంజ్, అన్సారిరోడ్డు, వట్టేపల్లి, ఇంజన్‌బౌలి, అష్క్‌మహాల్, మహాబూబ్‌మేన్షన్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌ఘాడ్, ముసారామ్‌భాగ్, మలక్‌పేట, అలియాబాద్, మైసారం, గౌలిపుర, తాలాబ్‌కట్టా, మాదన్నపేట, యాకుత్‌పుర, బోగ్గులకుంట, అఫ్జాల్‌గంజ్, జియాగుడ కొంత ప్రాంతం, అడిక్‌మెట్, రామంతపూర్, గోల్నాక, డిడి కాలనీ, నల్లకుంట, విద్యానగర్, ముషీరాబాద్, అజామాబాద్, నారాయణగుడ, భోలక్‌పూర్, బాగ్‌లింగంపల్లి, వైశాలినగర్, దిలుసుఖ్‌నగర్‌లో కొన్ని ప్రాంతాలు. రూరల్ వాటర్ సప్లై పథకం కింద నీటి సరఫరాను కొనసాగిస్తున్న నల్గొండ, నాసర్లపల్లి, గోడకొండ్ల, ఇబ్రహీంపట్నం, గున్‌గల్ ప్రాంతాలకు రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.