హైదరాబాద్

సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం *గుండెపోటుతో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: డ్రైవింగ్ చేస్తూనే గుండెపోటుకు గురైన ఓ క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. గుండెపోటుతో డ్రైవింగ్ సీట్లోనే వున్న డ్రైవర్ సమస్ఫూర్తితో పెనుప్రమాదం తప్పింది. ఇతర వాహనదారులకు, పాదచారులకు ప్రమాదం జరుగకుండా తుదిశ్వాస విడిచిన క్యాబ్ డ్రైవర్‌ను పలువురు ప్రశంసించారు. ఆదివారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన క్యాబ్ (ఏపీ29 టివి 1964) నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ వైపు వెళుతోంది. క్యాబ్ డ్రైవర్ రామస్వామికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతోనే అప్రమత్తమై కారును స్లో చేశాడు. రోడ్డు పక్కనే వున్న గాంధీ కుటీర్ బస్తీ మలుపులో కారును ఆపేసి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానిక బస్తీవాసులు కారు డోరు తెరచి డ్రైవర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను పరిశీలించిన వైద్యులు డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు నారాయణగూడ పోలీసులు తెలిపారు. తనకు ప్రాణాపాయం ఉన్నా తన కారు అదుపుతప్పితే ప్రమాదమని భావించిన క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేయడం పట్ల స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.