హైదరాబాద్

ఎంసెట్‌లో గ్రేటర్‌కు నాలుగు టాప్ ర్యాంక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ఇంటర్మీడియట్, టెన్త్ ఫలితాల్లో కాస్త వెనకంజలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌కు ఎంసెట్‌లో నాలుగు టాప్ ర్యాంక్‌లు దక్కాయి. ఇందులో భాగంగా కెపిహెచ్‌బి ధనలక్ష్మి సెంటర్‌లో నివాసముండే వభిలిసెట్టి మోహన్ అభ్యాస్ 155 మార్కులతో 5వ ర్యాంక్‌ను సాధించగా, మాదాపూర్ కావూరిహిల్స్ ప్లాన్ నెం. 126లో నివాసముండే ఎంవిఎస్‌ఎన్ ప్రణీత్ కూడా 155 మార్కులతో 7వ ర్యాంక్‌ను చేజిక్కించుకున్నారు. అదే విధంగా ఇదే ప్రాంతానికి చెందిన మరో విద్యార్థి బి. నిఖిల్ 154 మార్కులతో పదవ ర్యాంకు, అలాగే సికిందరాబాద్ స్కందగిరి సమీపంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన సాత్విక్ అంబటి అనే విద్యార్థి 153 మార్కులతో 11వ ర్యాంక్‌ను సాధించాడు. టాప్ ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కలెక్టరేట్‌లో కూరగాయలు, మామిడిపళ్ల స్టాళ్లు
కీసర, మే 22: కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయలు, మామిడిపళ్ల స్టాళ్లు ఏర్పాటు చేయటం వల్ల సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడతాయని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూరగాయలను, మామిడిపళ్లను పరిశీలించి, వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి రసాయనాలు ఎరువులు వాడకుండా, కేవలం సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించిన రైతులను కలెక్టర్ అభినందించారు. ప్రతి రైతు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసినట్లయితే అధిక దిగుబడులతో పాటు, ప్రజల ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు.
29వ రోజుకు చేరిన
పశువైద్య విద్యార్థుల నిరసన
రాజేంద్రనగర్, మే 22: గ్రామీణ పశుసంపద కేంద్రాలను పశువైద్య శాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని చేస్తున్న నిరసన కార్యక్రమాలు 29వ రోజుకు చేరుకున్నాయి. రాజేంద్రనగర్‌లోని పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత సోమవారం నిరసనలో భాగంగా విద్యార్థులు నినాదాలు, పాటల రూపంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కుట్రపూరితంగా వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని అన్యాక్రాంతం చేయడానికి చూస్తుందని ఆరోపించారు. మండుటెండల్లో 29 రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. ఈనెల 25లోగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్టవ్య్రాప్తంగా యూనివర్సిటీలను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.