హైదరాబాద్

‘ప్రజావాణి’ విజ్ఞప్తులను పరిశీలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ప్రజావాణికి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి వెంటనే పరిష్కారం చేసే విధంగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్ రావు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వారంలోపే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జె.యన్.యన్.యు.ఆర్.యం ఇండ్ల కేటాయింపులు, పింఛన్లు, భూ సమస్యలు, రుణ మంజూరు, రుణమాఫీ, ఆహార భద్రత కార్డు తదితర అంశాలపై సుమారు 66 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులందరూ మంగళవారం సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ సంవత్సరపు బడ్జెట్‌లో సంక్షేమ స్కీంలలో నిధులు ఉన్నట్లయితే వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.జూన్‌లో పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నందున పాఠశాలల్లో పుస్తకాలు, ఫర్నీచర్ మరమ్మతులు, మంచినీటి వసతులు, మధ్యాహ్న భోజన పథకంనకు కావలసిన బియ్యం, నూనెలు, పప్పులు తదితర వస్తువులు నిల్వ చేసుకోవాలని, రెసీడెన్సీయల్ పాఠశాలల్లో మరమ్మతులు, వౌలిక వసతులు సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలని డిఇఓను, సంక్షేమ శాఖాధికారులను, డియస్‌ఓను కలెక్టర్ ఆదేశించారు.ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్, సిపిఓ శర్మ, స్పెషల్ డిప్యూటీ తహసీల్దారు స్వర్ణ లత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఐటి వినియోగంతో మరింత మెరుగైన పౌరసేవలు