హైదరాబాద్

జీతాల పెంపు సరే.. పర్మినెంట్ సంగతేంటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: కోటి మంది జనాభాకు పౌరసేవలను అందిస్తున్న జిహెచ్‌ఎంసిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ తన హామీని నిలబెట్టుకుని వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సహకార్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి ఆదిల్ షరీఫ్ కోరారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను ప్రభుత్వం రూ. 12వేల 500 నుంచి రూ. 14వేలకు పెంచటాన్ని స్వాగతించిన ఆయన కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెంటనే వారందరినీ పర్మినెంటు చేయాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్లపై ప్రమాదపు అంచుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కేవలం రూ. 1500 జీతాన్ని పెంచితే అవి వారి అవసరాలకు ఏం సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కార్మికులను పర్మినెంటు చేస్తామన్న కెసిఆర్ హామీపై వేలాది మంది కార్మికులు ఆశలు పెట్టుకున్నారని, ఇపుడు వారి ఆశలపై నీళ్లు చల్లకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న వారందరిలో నూటికి నూరు శాతం మంది కార్మికులు ఇదే పనిపై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని వివరించారు.