హైదరాబాద్

ఎగ్జిబిషన్లతో చే‘నేత’కు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 25: నగరంలో కొలువుదీరుతున్న ఎగ్జిబిషన్లతో చేనేత కళాకారులకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందని వర్ధమాన నటి షాలు చెరాసియా అన్నారు. గురువారం అమీర్‌పేటలోని నాగార్జునగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటుచేసిన పోచంపల్లి ఇకత్ మేళాను సామాజిక వేత్త పద్మజతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతకారులు రూపొందించిన దుస్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్ల ద్వారా లభిస్తుందని అన్నారు. దీంతో వారు ఆర్థికంగా బలపడటంతో పాటు నగర వినియోగదారుల అభిరుచులను తెలుసుకొని వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోగలుగుతారని అన్నారు. నగర వాసులు వారానికోరోజైనా చేనేత దుస్తులు ధరించడం ద్వారా చేనేతకారులను ప్రోత్సహించిన వారౌతారని అన్నారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌లో పోచంపల్లి చేనేతకారులు మగ్గాలపై రూపొందించిన వివిధ రకాల వస్త్రాలను అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు కృష్ణ తెలిపారు.