హైదరాబాద్

ముంచుకొస్తున్న వర్షాకాలం * హోర్డింగ్‌లతో పొంచి ఉన్న ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హానగరంలో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నవారికి హెల్మెట్ తప్పనిసరి చేయడం మంచిదైంది. ఎందుకంటే ఎపుడు బలమైన ఈదురుగాలులు వీచి ఏ హోర్డింగ్ తలపై కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ప్రచారం కోసం ఏర్పాటుచేస్తున్న ఈ హోర్డింగ్‌లతో మహానగర పాలక సంస్థకు కాసుల వర్షం కురిస్తున్నా, ఈ హోర్డింగ్‌లు ప్రజల పాలిట ప్రాణసంకటంగా మారుతున్నాయి. గతంలో పలు వర్షాకాలంలో పలు హోర్డింగ్‌లు కూలి కొందరు ప్రాణాలు కోల్పోవటంతో కొత్త హోర్డింగ్‌ల అనుమతులపై జిహెచ్‌ఎంసి నిషేధం విధించింది. అయినా కొందరు రాజకీయ నేతల అండతో నగరంలో ఇష్టారాజ్యంగా హోర్డింగ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోర్డింగ్‌ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై అధ్యయనానికి జిహెచ్‌ఎంసి ఆదేశించింది. శిథిలావస్థలో ఉన్న వారికి యజమాన్యాలు, యాడ్ ఏజెన్సీలు పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. నిపుణులు స్ట్రక్చరల్ స్టెబిలిటీ బాగుంది అంటూ సర్టిఫై చేసిన హోర్డింగ్‌లు కూడా కూలిన ఘటనలున్నాయి.
దీనికి జిహెచ్‌ఎంసి ఎవరినీ బాధ్యులను చేయలేదు. అంతేగాక జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో ఓ కమిటీని కూడా వేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి సైతం నాలుగు హోర్డింగ్‌లు నేలకొరిగాయి. దీనికితోడు ఈసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయంటూ హెచ్చరికలు రావటంతో నెలరోజుల పాటు కొత్త హోర్డింగ్‌ల ఏర్పాటుపై నిషేధం కూడా విధించారు. అయినా బలమైన ఈదురు గాలులు వీచి, ఎపుడు ఎక్కడి నుంచి ఏ హోర్డింగ్ మీద కూలుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో మొత్తం 2651 హోర్డింగ్‌లుండగా, వీటిలో 333 హోర్డింగ్‌లు అనుమతుల్లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసినవిగా అధికారులు గుర్తించారు. కానీ కేవలం 1156 హోర్డింగ్‌లకు మాత్రమే అనుమతులిచ్చామని జిహెచ్‌ఎంసి అధికారులు చెబుతున్నారు. ఇక వీటితో పాటు బలమైన ఈదురుగాలు వీస్తే కూలేవి యూనిపోల్స్. గతంలో ఈ యూనిపోల్స్ కూడా కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా కొన్ని యాడ్ కంపెనీల యాజమాన్యాలు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నాయి. వర్షాకాలం సీజనలో సీజనల్ ప్రకటనలు చేసే జిహెచ్‌ఎంసి అధికారుల ప్రకటనలు అలా ఉంచితే, నగరంలో హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు సాగించాల్సి ఉంటే ప్రజలు వారి జాగ్రత్తలో వారుండటం మంచిదనే చెప్పవచ్చు.