హైదరాబాద్

సత్ఫలితాలిస్తున్న బస్సుయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: జిహెచ్‌ఎంసి పరిధిలోని సర్కిళ్ల స్థాయి సమస్యల పరిష్కారానికి అధికారులు చేపడుతున్న క్షేత్ర స్థాయి బస్సు యాత్రలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇదివరకు ఓ సర్కిల్‌లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఎవరికివారే తమకిష్టమొచ్చిన సమయంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను వేర్వేరుగా పరిశీలించేవారు. ఇపుడు కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక సర్కిల్‌కు చెందిన అన్ని విభాగాలకు చెందిన అధికారులంతా ఒకే బస్సులో ఉదయం తమ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను పరిశీలిస్తున్నారు. ఈ రకంగా ఒకే సర్కిల్‌కు చెందిన అన్ని విభాగాల అధికారులు ఒకే బస్సులో ఒకేసారి ప్రజలకు మధ్యకు రావటంతో అన్ని రకాల సమస్యలు కూడా ఏకకాలంలో త్వరితగిన పరిశీలించేందుకు ఆస్కారమేర్పడింది. అంతేగాక, ఇంతకు ముందు వైద్యారోగ్య విభాగం అధికారులు వేరుగా, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ ఇతర విభాగాల అధికారులు సైత వేర్వేరుగా తమ సమయాన్ని బట్టి తమతమ వాహనాల్లో సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లోపర్యటించేవారు. ఇపుడు అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకే బస్సులో పర్యటించటంతో సర్కిళ్లలో వివిధ విభాగాల మధ్య సమన్వయం పెరగటంతో పాటు అధికారుల రవాణాకు సంబంధించి వ్యయం కూడా తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. గత వారం నుంచి ఏడు సర్కిళ్లలో బస్సులో ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, మెడికల్ ఆఫీసర్లు, యుసిడి, ట్యాక్స్ విభాగం అధికారులు, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు కలిసి వెళ్లటంతో స్థానికంగా చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పడే నిర్వాహణ సమస్యలు, సమన్వయలోపం వంటివి కూడా సకాలంలో పరిష్కారమై పనుల వేగం పుంజుకుంటుంది. సాధారణంగా అయితే వివిధ విభాగాలకు చెందిన అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లాలంటే కనీసం పది నుంచి పనె్నండు వాహనాలు వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకు బదులుగా అందరూ అధికారులు ఒకే బస్సులో ప్రయాణించటం వల్ల ఇంధనంతో పాటు అధికారుల సమయం కూడా ఆదా అవుతోంది. అంతేగాక, ఒక సర్కిల్ పరిధిలోని అన్ని శాఖల మధ్య అంతర్గతంగా సమన్వయం పెరగటంతో పాటు ఒక అభివృద్ధి పనికి సంబంధించి విభాగాల వారీగా వహించాల్సిన భాగస్వామ్యం కూడా స్పష్టమవుతుందని, దీని వల్ల పనులకు ఇతర అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ బస్సు యాత్రలు మంచి ఫలితాలనివ్వటంతో వీటిని కొనసాగించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వర్షం కురిసినా బేఫికర్
అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
సమస్యలు తెలుసుకునేందుకు సమాచార వ్యవస్థ
ఒక్కో ప్రాంతానికి ప్రత్యేక ఇన్‌చార్జి నియామకం
అత్యవసర సహాయక చర్యల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 25: మహానగరంలో ఇకపై వర్షం కురిసినా రోడ్డుపై రాకపోకలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జిహెచ్‌ఎంసి కాస్త ముందుగానే ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా వర్షాలు కురిసినపుడు ట్రాఫిక్‌కు తీవ్ర స్థాయిలో అంతరాయం కల్గించే 80 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన జిహెచ్‌ఎంసి అక్కడ వర్షపు నీరు నిల్వకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. అంతేగాక, ఎప్పటికపుడు సహాయక చర్యలు వంటివి వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక సమాచార వ్యవస్థను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే గుర్తించిన ఈ 80 సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్క్కో కేంద్రానికి వర్క్ ఇన్‌స్పెక్టర్ మొదలుకుని సహాయ ఇంజనీర్ వరకు ఒక ఇంజనీరింగ్ విభాగం అధికారిని ఇంఛార్జిగా నియమించటం ఆయనకు సహాయంగా కార్మికులను నియమించారు. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసినపుడు ఈ 80 సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా నిలిచే నీటిని ఎప్పటికపుడు తోడేసే రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా, ప్రజల వెంటనే తెలియజేసేందుకు ప్రత్యేక ఇంజనీర్ బృందాలు, ఇన్‌ఛార్జిలు, వారి సహాయకుల ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారాన్ని ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. భారీగా వర్షాలు కురిసినపుడు ఎలాంటి సమస్య తలెత్తినా, స్థానికులు ఒక్క ఫోన్ కాల్ చేసి ఫిర్యాదు చేసినా, క్షణాల్లో బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలో రోడ్ల నిర్వహణకు స్థానిక సమాచార వ్యవస్థను ఏర్పటు చేయటం ద్వారా తగు ఫలితాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 9వేల కిలోమీటర్ల పై చిలుకు రోడ్ల మెరుగైన నిర్వాహణ కసం స్థానికంగా ప్రతి వంద మీటర్ల రోడ్డుకు సంబంధించి ఎప్పటికపుడు సమాచారాన్ని అందించేందుకు స్థానికులను ఇన్పార్మర్లుగా నియమించారు. స్వచ్చందంగా సేవలు అందించే వీరు తమ పరిధలి ఉన్న రోడ్లపై ఏర్పడే గుంతలు, దెబ్బతిన్న రోడ్ల వివరాలను వెంటనే తమ ఇంజనీరింగ్ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రకంగా రోడ్డుకు సంబంధించి క్షేత్ర స్థాయి నుంచే సమాచారం, ఫిర్యాదులు రావటంతో అధికారులు కూడా వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమం అయిందని వివరించారు. నగరంలో 234 పాయింట్లలో నీటి నిల్వలు ఉంటాయని గుర్తించామని, వీటిలో 250 కేంద్రాల్లో సమస్యను పరిష్కరించటం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సమస్యాత్మక ప్రాంతల్లా పేవర్ బ్లాకుల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణ, వర్షపు నీటి కాలువల నిర్మాణం తదితరు చర్యలను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.