హైదరాబాద్

టిఎస్ ఐపాస్ దరఖాస్తులను పరిశీలించి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: టిఎస్ ఐపాస్ కింద అందిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల నుండి అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. పరిశ్రమల అనుమతులకు వచ్చిన దరఖాస్తులన్నింటిని ఏ శాఖ వద్ద అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని పరిశీలించి వాటిని త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్‌ఓసిలు త్వరగా దరఖాస్తుదారులకు అందించేందుకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. టి-ప్రైడ్ కింద స్వీకరించిన దరఖాస్తులను వచ్చే డిఐపిపి సమావేశానికల్లా క్లియర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్ రెడ్డి, సరూర్‌నగర్ డివిజనల్ డిటిఓ (ఆడిట్) ఎ.శ్రీనివాసరావు, డి.రవికుమార్, వివిఇ, చంపాపేట్ ఎం.వెంకన్న, ఇఇటిఎస్ పిసిబి, ఫైర్ సర్వీసెస్ అధికారి డివి ప్రసాద్, డి.రవి, టిఎస్-ఐఐసి శంషాబాద్ టి.సుజాత, డిడి ప్యాబ్స్, లావణ్య, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ నీలిమ పాల్గొన్నారు.
లోటుపాట్లు లేకుండా అవతరణ
దినోత్సవ వేడుకలు జరపాలి
సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశమై రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై డిఆర్‌ఓ భవాని శంకర్‌తో కలిసి సమీక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రధానం చేయనున్న అవార్డుల ఎంపికలో సంబంధిత శాఖల అధికారులు పారదర్శకత పాటించి విమర్శలకు తావివ్వకుండా చూడాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిపిఆర్‌ఓకు సూచించారు. ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించుటకు గాను సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియానికి శనివారం రావాలని అధికారులను ఆదేశించారు.