హైదరాబాద్

టిడిపి ఉందా? అనే వారికి మహానాడు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలంగాణలో అసలు టిడిపి పార్టీ ఉందా? ఉంటే ఎక్కడుంది? అంటూ మాట్లాడినవారందరికి ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహానాడు చెంప దెబ్బలాంటిదని నగర టిడిపి నేతలు వ్యాఖ్యానించారు.
ఈ మేరకు శుక్రవారం నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నగర అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, నగర కార్యదర్శి మేకల సారంగపాణి, నేతలు భజరంగ్ శర్మ, వనం రమేష్‌లు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన నిర్వహించిన మహానాడు సమావేశానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి తాము ఊహించిన దానికన్నా రెట్టింపు సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారని వివరించారు.
ఎన్నో ఒడిదుడుడుకులు ఎదురైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఎదురులేదన్నారు. పదివేల మంది హాజరుకావచ్చునని తాము భావించినా, దాదాపు 18వేల నుంచి 20వేల మంది వరకు నేతలు, కార్యకర్తలు స్వచ్చందంగా మహానాడు కార్యక్రమంలో పాల్గొనటంతో వాస్తవానికి కొన్ని సౌకర్యాలు తక్కువయ్యాయని వివరించారు. అయినా నేతలు, కార్యకర్తలు మహానాడును విజవయంతం చేశారని వివరించారు.
వచ్చిన నేతలు, కార్యకర్తలంతా కూడా స్వచ్చందంగా పార్టీపై అభిమానంతో, అధినేతపై ఉన్న గౌరవంతో హజరైనవారేనని వివరించారు. ఈ మహానాడు కార్యక్రమం విజయవంతమైన స్పూర్తితోనే టిడిపి నేతలు కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సమయాత్తం కావాలని పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రం ఏర్పడి, అధికారం చేపట్టిన మూడేళ్లకే టిఆర్‌ఎస్ పార్టీపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరుగుతోందని, ఇక టిఆర్‌ఎస్ నేతలు మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేయలేరని వివరించారు. త్వరలోనే ప్రజలు గుణపాఠం నేర్పుతారని అధ్యక్షుడు ఎం.ఎన్, కార్యదర్శి సారంగపాణి వ్యాఖానించారు.
వైజాగ్ మహానాడుకు 2వేల మంది
ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో శనివారం టిడిపి పార్టీ నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి తెలంగాణ టిడిపి పార్టీ తరపున రెండు వేల మంది ప్రత్యేక ఏసి రైలులో బయల్దేరారు.
సాయంత్రం మూడు గంటలకు నగర టిడిపి అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాసరావు జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. దీనికి తోడు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేకంగా కార్లు, మినీ బస్సులు, టెంపో ట్రావెలర్లలతో తరలి వెళ్లినట్లు ఆయన వివరించారు.