హైదరాబాద్

సెల్ఫీ వేధింపులు బాధితురాలి ఫిర్యాదు * యువకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: సెల్ఫీ మోజు కటకటాల పాలు చేసింది. క్లాస్‌మేట్ కదా.. అని సెల్ఫీ దిగినందుకు ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిన యువతి ఫొటోలను (సెల్ఫీ) తన స్నేహితులకు పోస్టు చేసి కటకటాలపాలయ్యాడో ప్రబుద్ధుడు. ఈ సెల్ఫీ అడ్డుపెట్టుకుని స్నేహితులు కూడా వేధింపులకు పాల్పడగా, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సంఘటన వివరాలిలావున్నాయి. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట మహాలక్ష్మినగర్ కాలనీకి చెందన జొన్న వెంకటసాయికృష్ణ గౌడ్‌కు తన క్లాస్‌మేట్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. కాగా ఈ యువతితో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని ఆసరగా చేసుకున్న నాగసాయికృష్ణ గౌడ్ పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడు. యువతి మాత్రం పెళ్లికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న యువకుడు, ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫొటోలను మన్సూరాబాద్ సహారా ఎస్టేట్‌లో ఉంటున్న స్నేహితులు సిరనగండ్ల ప్రదీప్ కుమార్, రఘువీర్‌కు పంపాడు. దీంతో వీరిద్దరూ కూడా ఆ యువతిని వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులకు వివరించింది. పోలీసులకు యువతి, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంకటసాయికృష్ణగౌడ్, ప్రదీప్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నట్టు ఏసిపి రవీందర్‌రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.